EPFO Recruitment : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్ గానైనా చదివి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.

Employees Provident Fund Organization Vacancies
EPFO Recruitment : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 06 ప్రకారం నెలవారీ జీతం చెల్లిస్తారు. రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్ గానైనా చదివి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
READ ALSO : Second Saturday : రెండవ శనివారం సెలవు ఎందుకంటే? ఆసక్తికరమైన కథ చదవండి.
ఎంపికైన వారికి రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకూ వేతనం చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో జూలై 13, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.epfindia.gov.in/ పరిశీలించగలరు.