TSPSC : గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు గడువు జూన్ 4 వరకు పొడిగింపు
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ వాస్తవానికి ఈ గడువు మే31 మంగళవారం రాత్రితో ముగిసింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

TSPSC Group 1
TSPSC : తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ వాస్తవానికి ఈ గడువు మే31 మంగళవారం రాత్రితో ముగిసింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్పీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఇప్పటివరకు 3,48,095 దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటి రికార్డును ఇది అధిగమించినట్టయ్యింది.
2011లో 312 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా అప్పట్లో 3,02,912 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం గమనార్హం. గడువు పొడిగించిన నేపథ్యంలో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. మంగళవారం నాటికి ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకొన్నవారి సంఖ్య 5,58,275కు చేరింది.
Also Read : Kerala: ఆ ఇద్దరు యువతులు కలిసి జీవించొచ్చు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు..