Job Vacancies : సైనిక్ స్కూల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ,పీజీ,బీఈడీ,ఎంఈడీ,సీటీఈటీ,ఎస్టీఈటీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Job Vacancies : సైనిక్ స్కూల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Sainik School

Updated On : July 31, 2022 / 4:37 PM IST

Job Vacancies : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ సైనిక్ స్కూల్‌ లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా 14 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టీజీజీ, ఆర్ట్ మాస్టర్, మ్యూజిక్‌ టీచర్‌, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ, పీటీఐ- కమ్ మాట్రాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ,పీజీ,బీఈడీ,ఎంఈడీ,సీటీఈటీ,ఎస్టీఈటీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.sainikschooljhansi.com పరిశీలించగలరు.