Job Opportunities: పురుషులకు అద్భుత అవకాశం.. విదేశీ ఉద్యోగాలు, రూ.70 వేలు జీతం.. అర్హత, రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు

Job Opportunities: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ భాగస్వామ్యంతో కువైట్‌లో నిర్మాణ రంగంలో భారీ ఉద్యోగాలు కాంళిపిస్తోంది.

Job Opportunities: పురుషులకు అద్భుత అవకాశం.. విదేశీ ఉద్యోగాలు, రూ.70 వేలు జీతం.. అర్హత, రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు

Jobs Opportunities In Kuwait

Updated On : July 10, 2025 / 12:09 PM IST

ఏపీలోని పురుషులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ భాగస్వామ్యంతో కువైట్‌లో నిర్మాణ రంగంలో భారీ ఉద్యోగాలు కాంళిపిస్తోంది. ఈమేరకు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ అధికారిక ప్రకటన చేశారు. APSSDC, NAC ఆధ్వర్యంలో కువైట్లోని నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయని, అనుభవజ్ఞులైన నిర్మాణ కార్మికులకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగనుందని, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

పోస్టుల వివరాలు: ఈ కార్యక్రమంలో భాగంగా సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్స్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్య, అనుభవం వివరాలు: ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్తిలు ఐటీఐ, డిప్లొమా పూర్తికి చేసి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 25 నుండి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.

వేతనం వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్తిలకు నెలకు రూ. 56,000 నుంచి రూ, 70,000 జీతం అందుతుంది.

ముఖ్యమైన వివరాలు: వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, వైద్య సదుపాయాలు, నివాసం వంటి ఏర్పాట్లను కంపెనీ భరిస్తుంది.

అవసరమైన ధ్రువపత్రాలు: అభ్యర్థుల పాస్పోర్ట్, ఐటీఐ, డిప్లొమా సర్టిఫికెట్, అనుభవం, ధ్రువీకరణ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

అలాగే తమ బయోడేటాను skillinternet.irralapesh.in కు ఈ మెయిల్ చేయవచ్చు.

ఇంకా ఏమైనా సందేహాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9988853335 ను సంప్రదించవచ్చు.