GATE 2024 Application Correction : గేట్-2024 అభ్యర్థులకు అప్లికేషన్ కరెక్షన్ కు మరో అవకాశం.. మార్పులు చేర్పులకు గడువు పొడిగింపు
గేట్ అడ్మిట్‌కార్డులు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచనున్నారు. గేట్ పరీక్షలు ఫిబ్రవరి 3న ప్రారంభమై 4, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 16న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్, 21న ఆన్సర్ కీ విడుదల చేస్తారు.

Application Correction
GATE 2024 Application Correction : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE)-2024 అభ్యర్థులు దరఖాస్తు వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది. దీనికి సంబంధించిన గడువు పొడగిస్తూ ఐఐఎస్‌సీ బెంగళూరు నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ తాజాగా గేట్-2024 అప్లికేషన్ కరెక్షన్స్ కు నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో అభ్యర్ధులు తమ అప్లికేషన్స్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం లభించిస్తుంది.
అప్లికేషన్ ఎడిట్ చేసే విధానం ;
స్టేజ్ 1 ; ముందుగా అధికారిక పోర్టల్ gate2024.iisc.ac.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ‘రిజిస్ట్రేషన్ కరెక్షన్ విండో’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టేజ్ 2; అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యెక్క వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీంతో గేట్-2024 అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
స్టేజ్ 3 ; ఏవైనా వివరాలను మార్చాలనుకుంటే మార్చి అప్లికేషన్‌ను అప్‌డేట్ చేయాలి. అందుకు అవసరమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్టేజ్ 4 ; తరువాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
READ ALSO : Minister KTR : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్
మార్పులకుగాను ఫీజు వివరాలు ;
దరఖాస్తు వివరాలను సవరించడానికి అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. మహిళలు,ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇతర కేటగిరీ, పీడబ్ల్యూడీ/డైస్లెక్సిక్ అభ్యర్థులు నాన్-పీడబ్ల్యుడి/డైస్లెక్సిక్‌గా మారాలనుకుంటే తప్పనిసరిగా రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరిలో పరీక్షలు ;
గేట్ అడ్మిట్‌కార్డులు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచనున్నారు. గేట్ పరీక్షలు ఫిబ్రవరి 3న ప్రారంభమై 4, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 16న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్, 21న ఆన్సర్ కీ విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 25 వరకు గడువు విధించారు. గేట్ ఫలితాలు మార్చి 16న వెల్లడిస్తారు. గేట్ స్కోర్‌కార్డ్‌ను మార్చి 23న డౌన్‌లోడ్ చేసుకోవటానికి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
READ ALSO : ITBP Recruitment 2023 : ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
పరీక్ష విధానం
గేట్-2024 సీబీటీ మోడ్‌లో జరుగుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు సమయం ఉంటుంది. గేట్ ఎగ్జామ్‌లో మొత్తం 30 పేపర్స్ ఉంటాయి. ఒక అభ్యర్థి ఒక పేపర్ లేదంటే గరిష్టంగా రెండు పేపర్స్‌కు మాత్రమే హాజరుకావాల్సిఉంటుంది. ఈ ఏడాది డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త పేపర్‌ను తీసుకొచ్చారు. ప్రశ్నాపత్రాలు ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ఆబ్జెక్టివ్ వెరైటీలో ఉంటాయి.