నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : అమెజాన్‌లో కొత్త ఉద్యోగాలు

భారత్ లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ఇండియాలో 1,300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ స్టోర్లలో వెయ్యికు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : January 14, 2019 / 07:58 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : అమెజాన్‌లో కొత్త ఉద్యోగాలు

Updated On : January 14, 2019 / 7:58 AM IST

భారత్ లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ఇండియాలో 1,300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ స్టోర్లలో వెయ్యికు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది.

  • ఆసియా ఫసిఫిక్ లోనే అత్యధికం.. చైనా కంటే మూడు రెట్లు అధికం

  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలపైనే అమెజాన్ ఫోకస్ 

భారత్ లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ఇండియాలో 1,300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ స్టోర్లలో వెయ్యికు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. జాబ్ ఓపెనింగ్స్ కు సంబంధించి డేటాను అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది. ఆసియా ఫసిఫిక్ లోనే అత్యధికంగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నట్టు పేర్కొంది. అంటే.. చైనాలోని అమెజాన్ ఉద్యోగాలు కంటే మూడు రెట్టు భారత్ లోనే అధికం. ఇండియా తరహాలో జర్మనీలో మాత్రమే చాలా ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నాలజీ రంగాన్ని మినహాయిస్తే.. చాలా కంపెనీల్లో ఈ-కామర్స్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. భారత్ లో 1,286 ఉద్యోగాలు ఉంటే.. చైనాలో 467 ఉద్యోగాలు, జపాన్ లో 381 ఉద్యోగాలు, ఆస్ట్రేలియాలో 250, సింగపూర్ లో 174 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. 

10 శాతం ఇండియాలోనే..
దేశవ్యాప్తంగా అమెజాన్ ఇండియా.. ఈ-కామర్స్, క్లౌడ్ బిజినెస్ (ఎడబ్ల్యూఎస్) వెంచర్లు, పేమెంట్స్, కంటెంట్ (ప్రైమ్ వీడియో), వాయిస్ అసిస్టెంట్ (అలెక్సా), ఫుడ్ రిటైల్, కన్ జ్యుమర్ సపోర్ట్ వంటి పలు కీలక రంగాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. 2018 ఏడాది చివరి నాటికి అమెజాన్ 60వేల మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 6.1 లక్షల అమెజాన్ ఉద్యోగులు ఉంటే అందులో 10 శాతం ఇండియాలోనే ఉన్నారు. అమెజాన్ కొత్త ఉద్యోగాలు ఎక్కువగా  హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనే ఉండనున్నాయి.

ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్ వ్యాపారాభివృద్ధికి భారత్ స్ట్రాంగ్ టాలెండ్ లోకేషన్ అని అన్నారు. అమెజాన్ బృందాలు భారత్ లో పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాయని, ఇదే సంస్థ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎఫ్ డీఐ పాలసీపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కొత్త ఉద్యోగాల ప్రక్రియ పాలసీకి అనుగుణంగానే ఉంటుందని సంస్థ నిపుణులు విశ్వసిస్తున్నారు.