JEE Main Exams : జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల కొత్త తేదీలు.. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన JEE రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి.

Jee Main Second Session Postponed, To Begin From July 25, Announces Nta
JEE Main 2022 : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన JEE రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ పరీక్షలు రేపటి (జూలై 21) నుంచి ప్రారంభం అయి ఈనెల 30న ముగియాల్సి ఉంది. అనుకోని కారణాల రీత్యా జేఈఈ పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చినట్టు ఇటీవలే NTA ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే వాయిదా పడిన జేఈఈ పరీక్షలు జూలై 25 నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొంది.

Jee Main Second Session Postponed, To Begin From July 25, Announces Nta
జేఈఈ పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సుమారు 6,29,778 మంది సెషన్ 2 పరీక్షలకు హాజరుకానున్నారు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరిగాయి. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
పరీక్షకుల సంబంధించి అదనపు సమాచారం, అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 011 – 40759000 నంబర్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చునని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
Read Also : JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?