JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్.. ఒకరోజు మాత్రమే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2తో ముగియనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15, 2024 మధ్య జరుగనుంది. ఫలితాలను ఏప్రిల్ 25, 2024న ప్రకటిస్తారు.

JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్.. ఒకరోజు మాత్రమే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

JEE Main Session 2 Registrations To End Tomorrow, Check Details

JEE Main Session 2 Registrations : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, (జేఈఈ మెయిన్) సెషన్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2, 2024న ముగిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు మార్చి 2, 2024 గడువు తేదీగా గమనించాలి.

Read Also : AP TET 2024 Exams : ఫిబ్రవరి 27 నుంచే ఏపీ టెట్ పరీక్షలు.. పరీక్ష సమయం, తేదీలివే..!

జేఈఈ పరీక్షకు హాజరయ్యే దరఖాస్తుదారులు ఏయే నగరాల్లో పరీక్షా కేంద్రాలను నిర్వహించనున్నారో మార్చి 2024 మూడవ వారంలోపు వెల్లడి కానుంది. అడ్మిట్ కార్డ్‌లు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15, 2024 మధ్య పరీక్ష జరుగనుంది. ఇక జేఈఈ ఫలితాలు ఏప్రిల్ 25, 2024న ప్రకటించనున్నారు.

పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే? :

  • అధికారిక వెబ్‌సైట్‌ (jeemain.nta.ac.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత లాగిన్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
  • సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆపై పరీక్ష ఫీజు చెల్లించండి.
  • ఫారమ్‌ను సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోండి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), ఇతర కేంద్ర నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలు (CFTI) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశానికి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను నిర్వహిస్తాయి. అర్హత ప్రమాణాలలో 12వ తరగతి పరీక్షలో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి.

సంబంధిత బోర్డ్ 12వ తరగతి పరీక్షలో టాప్ 20 పర్సంటైల్‌ వంటివి ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) అభ్యర్థులకు అర్హత మార్కులు 65 శాతానికి తగ్గించారు. అదనంగా, ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఈ/బీటెక్/బీఆర్చ్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలో నిర్దిష్ట సబ్జెక్ట్ కాంబినేషన్‌లు తప్పనిసరిగా ఉండాలి.

Read Also : Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?