Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. అపోలో, ముత్తూట్ లో జాబ్స్.. ఖాళీలు, పూర్తి వివరాలు మీకోసం

Job Mela: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో జాబ్‌మేళా జరుగనుంది. ఆగస్టు 6వ తేదీన జరుగనున్న ఈ జాబ్‌ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.

Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. అపోలో, ముత్తూట్ లో జాబ్స్.. ఖాళీలు, పూర్తి వివరాలు మీకోసం

Job fair on August 6 at Subharam Government Degree College, Punganur, Chittoor district

Updated On : August 4, 2025 / 4:58 PM IST

ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ యువత కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జాబ్ మేళాల వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో జాబ్‌మేళా జరుగనుంది. ఆగస్టు 6వ తేదీన జరుగనున్న ఈ జాబ్‌ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సంస్థల్లో గల వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా గురించి ఏదైనా సందేహాల కోసం, సమాచారం కోసం 7780599208 నంబర్‌ను సంప్రదించవచ్చు.

సంస్థలు, ఖాళీల వివరాలు:

  • ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ లో 30 ఖాళీలు
  • అపోలో ఫార్మసీలో 60 ఖాళీలు
  • భారత ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ లిమిటెడ్ లో 50 ఖాళీలు
  • వెంకట్ హెచ్ఆర్ సర్వీసెస్ లో 30 ఖాళీలు
  • బీఎస్‌ఎస్ ఎంఎఫ్‌ఐ – కోటక్ గ్రూప్ లో 40 ఖాళీలు
  • డిక్సన్ లో 40 ఖాళీలు
  • ట్రెంట్ లిమిటెడ్ టాటా సంస్థలో 100 ఖాళీలు
  • ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 50 ఖాళీలు
  • టీసీఎల్ లో 50 ఖాళీలు
  • ముత్తూట్ ఫైనాన్స్ లో 20 ఖాళీలు ఉన్నాయి.