Job Replacement : ఎస్సిటీఐఎమ్ఎస్టి లో ఉద్యోగాల భర్తీ
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే సైకాలజీ, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ తదితర పోస్టులు భర్తీ చేయనున్న వాటిలో ఉన్నాయి.

Sctimst Jobs
Job Replacement : భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే సైకాలజీ, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ తదితర పోస్టులు భర్తీ చేయనున్న వాటిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , ఎంఎల్‌టీ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఎంఏ,తత్సమాన పరీక్ష, బీఫార్మసీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మోస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనానికి సంబంధించి నెలకు రూ. 18,000ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 22, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ https://www.sctimst.ac.in/ సంప్రదించగలరు.