JOBS : తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు
విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణలై ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.

Jobs
JOBS : తెలంగాణ హైకోర్టులో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 64 స్టెనోగ్రాఫర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
జిల్లాల వారిగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే అదిలాబద్ 3ఖాళీలు, ఖమ్మం 1, కరీంనగర్ 7, మహబూబ్ నగర్ 8, మెదక్ 3, నిజామాబాద్ 4, నల్గొండ 10, రంగారెడ్డి 20, హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్ట్ 6, హైదరాబాద్ సిటీ కోర్ట్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణలై ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే క్వాలిఫికేషన్ ఉండాలి. అభ్యర్ధుల వయస్సుకు సంబంధించి 2022 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులురూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరితేది 2022 ఏప్రిల్ 4 గా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు https://tshc.gov.in/documents/reccell_14_2022_03_03_16_06_11.pdf సంప్రదించగలరు.