ఫోని ఎఫెక్ట్: ఒడిశాలో నీట్ పరీక్ష వాయిదా

ఒడిశా రాష్ట్రంలో ఫోని తుఫాను కారణంగా రేపు (మే 5, 2019)వ తేదీన జరగాల్సిన నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET)ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా MBBS, BDS మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 5న నిర్వహించే NEETకు దేశ వ్యాప్తంగా 15.19 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు
* పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చెప్పిన సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
* నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమంతించరు.
* హాల్‌టికెట్ తప్పనిసరిగా ఉండాలి. హాల్‌టికెట్‌పాటు రెండు ఫొటోలను వెంట తీసుకెళ్లాలి.