నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో 512 టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు

సింగ్రౌలి(మధ్యప్రదేశ్) లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (NCL)లో టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 512 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3, 2020 నుంచి ప్రారంభంకానుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్దులు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ఫోర్ మెన్ (ట్రైనీ) – 79
టెక్నీషియన్ (ట్రైనీ) :
ఫిట్టర్ – 149
ఎలక్ట్రీషియన్ – 17
టర్నర్ – 19
మెషినిస్ట్ – 8
వెల్డర్ – 83
విద్యార్హత : అభ్యర్దులు 10వతరగతి, డిప్లామా పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐఐటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దలకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.500 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 3, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 25, 2020.