ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 01:46 AM IST
ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం

Updated On : April 20, 2019 / 1:46 AM IST

ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20 శనివారం నుంచి ఏప్రిల్ 24 వరకు జరుగనుంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లోనూ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- అగ్రికల్చర్‌ విభాగంలో 86వేల 910 మంది పరీక్ష రాయనున్నారు.

మొత్తం 115 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎగ్జామ్‌ సమయం కంటే గంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.