JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

Jobs

Updated On : July 7, 2022 / 2:36 PM IST

JOBS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్)లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. హెచ్‌ఆర్‌, సివిల్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, రష్యన్‌, ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్మెసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జులై 16, 2022 నుండి ప్రారంభమౌతుంది.దరఖాస్తులకు చివరి తేదీగా ఆగస్టు 16, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://bdl-india.in/ పరిశీలించగలరు.