Recruitment of Apprentice Posts : నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి.

Recruitment of Apprentice Posts : నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Recruitment of Apprentice

Updated On : October 1, 2023 / 1:42 PM IST

Recruitment of Apprentice Posts : నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1140 పోస్టుల ను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : GATE 2024 Application : గేట్ 2024 దరఖాస్తు గడువు పొడగింపు

విభాగాల వారీగా పోస్టుల సంఖ్య పరిశీలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ 13, ఎలక్ట్రీషియన్ 370, ఫిట్టర్ 543, వెల్డర్ 155, మోటార్ మెకానిక్ 47, ఆటో ఎలక్ట్రీషియన్ 12 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే 10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 15 అక్టోబర్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nclcil.in ని పరిశీలించగలరు.