ANGANWADI JOBS : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ

భర్తీ చేయనున్న పోస్టుల్లో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి, ప్రొటెక్షన్‌ అధికారి (ఇనిస్టిట్యూషనల్‌), (నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌), లీగల్‌ కమ్‌ ప్రొబిషన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఔట్ రిచ్‌ వర్కర్‌ పోస్టులు ఉన్నాయి.

ANGANWADI JOBS : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ

Women and Child Development

Updated On : November 8, 2023 / 12:08 PM IST

ANGANWADI JOBS : పశ్చిమగోదావరి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ,శిశు అభివృద్ధి సాధికారత అధికారి బి.సుజాత రాణి ఓ ప్రకటనలో తెలిపారు.

READ ALSO : IB Recruitment : పదోతరగతి పాసైతే చాలు…ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు

భర్తీ చేయనున్న పోస్టుల్లో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి, ప్రొటెక్షన్‌ అధికారి (ఇనిస్టిట్యూషనల్‌), (నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌), లీగల్‌ కమ్‌ ప్రొబిషన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఔట్ రిచ్‌ వర్కర్‌ పోస్టులు ఉన్నాయి.

READ ALSO : HAL Recruitment : 2లక్షలకు పైగా జీతం… హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

వీటితోపాటుగా ఎస్‌ఏఏకు సంబంధించి మేనేజర్‌, కో-ఆర్టినేటర్‌, సోషల్‌ వర్కర్‌, ఎర్లీ చైల్డ్‌ ఉడ్‌, నర్సు, దాక్టర్‌ (పార్ట్‌టైమ్‌), ఆయాలు, చౌకీదార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 10వ తేదీన గడువు ముగియనుంది.

READ ALSO : Free Training :సెల్ ఫోన్ రిపేర్, సీసీ కెమెరా ఇన్ స్టాలేషన్ లో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలు ఇవే !

వీటితోపాటు అంగన్ వాడీ పోషణ, 2.0 కింద జిల్లా కో ఆర్డినేటర్ 1 ఖాళీ, ప్రాజెక్టు అసిస్టెంట్ 1 ఖాళీ, బ్లాక్ కో ఆర్డినేటర్ 2 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భీమవరం జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా స్త్రీ,శిశు అభివృద్ధి సాధికారత అధికారి బి.సుజాత రాణి చెప్పారు.