SBI Resolver Recruitment : రాతపరీక్ష లేకుండానే ఎస్బీఐలో రిసాల్వర్ పోస్టుల భర్తీ

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు.

SBI Resolver Recruitment : రాతపరీక్ష లేకుండానే ఎస్బీఐలో రిసాల్వర్ పోస్టుల భర్తీ

SBI Resolver Recruitment

SBI Resolver Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లోపోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 రిసాల్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత లకిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

READ ALSO : Happy Diwali 2023: : దీపావళి బాణసంచా కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు !

అర్హతలు ;

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్థి రిటైర్డ్ SBI అధికారి అయిన పక్షంలో నిర్దిష్ట విద్యార్హత అవసరం లేదు. పని అనుభవం, సంబంధిత రంగంలో వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న మాజీ అధికారులకు ప్రాధాన్యత ఇస్తారు.

READ ALSO : Muscle Cramps : రాత్రిసమయంలో కండరాల తిమ్మిరి,పట్టుకుపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా ? సమస్యను తగ్గించే అద్భుతమైన ఆహారాలు మీకోసం !

ఎంపిక విధానం ;

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు కనీస అర్హత మార్కులను పొందితే ఇంటర్వ్యూలో పొందిన మార్కుల అవరోహణ క్రమంలో తీసి తుది ఎంపికకు సంబంధించిన మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.

READ ALSO : Remove Your Personal Data : ఆన్‌లైన్‌లో మీ పర్సనల్ డేటాను డిలీట్ చేయాలంటే ఎలా? గూగుల్ కొత్త ఫీచర్ ఉందిగా..!

దరఖాస్తు విధానం ;

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 1 నుండి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://sbi.co.in/ సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు నవంబర్ 21, 2023గా నిర్ణయించారు.