Bvfcl : బివిఎఫ్సిఎల్ లో అప్రెంటిస్ ల భర్తీ
అప్రెంటిస్ ల ఎంపిక మెట్రిక్యులేషన్, ఐటిఐ లో సాధించిన మెరిట్ మార్కులతోపాటు ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Bvfcl
Bvfcl : భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్రహ్మపుత్ర వాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీవీఎఫ్సీఎల్)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. శిక్షణ వ్యవధి 12 నెలలపాటు ఉంటుంది.
ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్ విభాగాల్లో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మన్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ డీజిల్ అప్రెంటిస్ లను భర్తీ చేస్తారు. అభ్యర్ధులు హెచ్ఎస్ఎల్ సీతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్ ల ఎంపిక మెట్రిక్యులేషన్, ఐటిఐ లో సాధించిన మెరిట్ మార్కులతోపాటు ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులు పంపేందుకు నవంబరు 24 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bvfcl.com