JOBS : సూర్యపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో టీచింగ్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 65 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీ పీజీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.

Scott Webb Photography
JOBS : తెలంగాణా స్టేట్ సూర్యాపేట లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికపై మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ట్యూబర్ క్యూలోసిస్ అండ్ రెస్పిరేటరీ, ఆఫ్తాల్మాలజీ, అనస్తీషియాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 65 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీ పీజీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రొఫెసర్ 1 ఖాళీ, అసోసియేట్ ప్రొఫెసర్ 11 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 6 ఖాళీలు, ట్యూటర్లు 9 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుకు జూన్ 8, 2022 తుదిగడువుగా ప్రకటించారు. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ జూన్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.telangana.gov.in/ పరిశీలించగలరు.