డియర్ ఇంటర్ స్టూడెంట్స్.. రిజల్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయా? వెంటనే ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేయండి..
మీకు ఫలితాల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. పాస్ కాలేకపోయిన విద్యార్థులు నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు. సప్లిమెంటరీ థియరీ పరీక్షలు రెండు సెషన్లలో మే 22 నుంచి జరుగుతాయి ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ఉంటాయి.
విద్యార్థులు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 23 నుంచి 30 వరకు వారి కాలేజీల్లో చెల్లించవచ్చు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీ విద్యార్థుల ఫలితాలను https://tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఐడీ పాస్‌వర్డ్‌లను ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు ఇచ్చింది.
9240205555 నంబర్‌కి ఫోన్ చేయవచ్చు
విద్యార్థులకు రిజల్ట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే 9240205555 నంబర్‌కి ఫోన్ చేయవచ్చు. లేదంటే helpdesk-ie-telangana.gov.inలో మెసేజ్ పంపొచ్చు. మీకు ఫలితాల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చు.
ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు ఈ సారి మరింత బాగా చదివి పప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్ కావవడం అంటే జీవితంలో ఓటమి సాధించినట్లు కాదు. మే 22 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షల కోసం వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.