Upsc : యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2022

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Upsc : యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2022

Upsc

Updated On : April 7, 2022 / 10:18 AM IST

Upsc : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)2022 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా మొత్తం 687 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్ షిప్, చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు ఏప్రిల్ 26, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పరీక్ష తేది జులై 17, 2022న నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాకలు వెబ్ సైట్ ; upsc.gov.in/సంప్రదించగలరు.