UPSC : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. అర్హతల విషయానికి వస్తే హిందీ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పోస్టులకు అర్హులు. రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

UPSC : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ

Upsc

Updated On : July 22, 2022 / 8:12 PM IST

UPSC : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్ అడ్వైజర్ 1 పోస్టు, అసిస్టెంట్ డైరెక్టర్ 11 పోస్టులు, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ 1 పోస్టు, సీనియర్ లెక్చరర్ 2 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. అర్హతల విషయానికి వస్తే హిందీ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పోస్టులకు అర్హులు. రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా ఆగస్టు 11, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.upsc.gov.in పరిశీలించగలరు.