UPSC Mains Result 2024 : త్వరలో యూపీఎస్సీ మెయిన్స్ రిజల్ట్స్ విడుదల.. గత ఏడాది ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే?
UPSC Mains Result 2024 : యూపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)లో చెక్ చేయవచ్చు. ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

UPSC Mains Result 2024 To Be Declared Soon
UPSC Mains Result 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) త్వరలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) మెయిన్స్ పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించనుంది. ఒకసారి ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)లో చెక్ చేయవచ్చు. అయితే, ఫలితాల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
యూపీఎస్సీ మెయిన్స్ 2024 పరీక్ష సెప్టెంబర్ 20, 21, 22, 28, 29, 2024 తేదీల్లో జరిగింది. ఈ పరీక్షకు హాజరైన మొత్తం 14,627 మంది అభ్యర్థులు ఇప్పుడు ఫలితాల విడుదల కోసం వేచి ఉన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు తదుపరి ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజరు కావాలి.
ఈ సంవత్సరం జూన్ 16, 2024న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీని ద్వారా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ సహా వివిధ సర్వీసుల కోసం 1056 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
గత సంవత్సరాల్లో ఫలితాల తేదీలివే :
గత సంవత్సరాల ట్రెండ్స్ ప్రకారం.. ఈ సంవత్సరం యూపీఎస్సీ ఫలితాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 2023లో యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 8, 2023న విడుదలయ్యాయి. 2018 నుంచి ఫలితాలు ఎప్పుడు ప్రకటించిందో ఒకసారి చూద్దాం..
సంవత్సరం రిజల్ట్స్ డేట్
2023 డిసెంబర్ 8, 2023
2022 డిసెంబర్ 6, 2022
2021 డిసెంబర్ 24, 2021
2020 జనవరి 16, 2021
2019 జనవరి 14, 2020
2018 డిసెంబర్ 20, 2018
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు 2024 : ఎలా చెక్ చేయాలి?
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)ను విజిట్ చేయండి.
- ‘Results’ అనే ట్యాబ్‌ని చూసి, దానిపై క్లిక్ చేయండి.
- యూపీఎస్సీ ఫలితాలపై క్లిక్ చేసిన తర్వాత మల్టీ ట్యాబ్‌లతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ‘సివిల్ సర్వీసెస్ 2024 ఎగ్జామ్ మెయిన్స్ రిజల్ట్’ అనే మరో ట్యాబ్ కోసం చూసి దానిపై క్లిక్ చేయండి.
- రిజల్ట్స్ పీడీఎఫ్ డాక్యుమెంట్‌గా ఉండవచ్చు. సూచనలను జాగ్రత్తగా ఫాలో చేయండి.
- అవసరమైన అన్ని వివరాలను నింపండి. పీడీఎఫ్‌లో మీ రిజల్ట్స్ కనుగొనండి.
- మీ రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం వైట్ A4 సైజు షీట్ పేపర్‌పై ప్రింట్ అవుట్ తీసుకోండి.
యూపీఎస్సీ సీఎస్ఈ ఫలితాలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ర్యాంక్‌లలో ఏ అభ్యర్థి చేరాలనేది నిర్ణయిస్తుంది.