UPSC Success Story : ఐఏఎస్ సోనాల్ గోయల్ సక్సెస్ స్టోరీ.. యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ చూశారా? ఆమె సివిల్స్ ప్రయాణం ఎందరికో ఆదర్శం..!

UPSC Success Story : ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె మార్క్‌షీట్ చూసిన సివిల్స్ అభ్యర్థులు అందులోని మార్కులను చూసి ఆశ్చర్యపోతున్నారు.

UPSC Success Story : ఐఏఎస్ సోనాల్ గోయల్ సక్సెస్ స్టోరీ.. యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ చూశారా? ఆమె సివిల్స్ ప్రయాణం ఎందరికో ఆదర్శం..!

UPSC Success Story : IAS Officer Sonal Goel Shares Her UPSC Marksheet

UPSC Success Story : యూపీఎస్సీ ప్రయాణం ఎంత కష్టతరమైనదో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆశావహులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కలతో వస్తారు. కానీ, అందులో కొంతమంది మాత్రమే అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. కృషి, పట్టుదలతో నిరంతరం కష్టపడుతూ విజయవంతమైన అభ్యర్థులే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఐఏఎస్ సోనాల్ గోయల్ ఒకరు.. ఎన్నో కష్టాల తర్వాత సోనాల్ ఈ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. ఈరోజు ఆమె ఐఏఎస్‌ అయింది. కానీ, తాను యూపీఎస్సీ కోసం కష్టపడిన రోజులను మాత్రం ఆమె ఇప్పటికీ మరిచిపోలేదు.

Read Also : 35 సార్లు ఫెయిల్.. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు.. ఆపై ఐఏఎస్ అధికారిగా.. సక్సెస్‌‌కు చిరునామా ఇతడే!

సోషల్ మీడియాలో మార్క్‌షీట్‌ షేరింగ్ :
ఈ క్రమంలోనే ఆమె ఇతర అభ్యర్థులను ప్రోత్సహించడానికి యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ను సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఫిబ్రవరి 21న ఈ పోస్ట్‌ను షేర్ చేసినట్లు సోనాల్ తెలిపింది. ఆమె మార్కులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ యూపీఎస్సీ పరీక్షలో సోనాల్ ఎలా విజయం సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి ప్రయత్నంలోనే విఫలం :
ఇందులో తన మార్క్‌షీట్‌ను షేర్ చేసింది. యూపీఎస్సీ కోసం ప్రీపేర్ అయ్యే రోజుల్లో తన అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు. సోనాల్ తన మొదటి ప్రయత్నంలో ఎలా విఫలమైందో చెప్పుకొచ్చారు. 2007లో తన మొదటి ప్రయత్నం చేయగా.. విఫలమైంది. మరుసటి సంవత్సరం అంటే.. 2008లో, సోనాల్ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించింది.

తక్కువ మార్కులు వచ్చినా.. :
మొదటి ప్రయత్నంలో జనరల్ స్టడీస్ పేపర్‌లో తక్కువ మార్కులు రావడంతో తనకు ఇంటర్వ్యూ కాల్ రాలేదని సోనాల్ చెప్పుకొచ్చారు. అయితే, ఆమె నిరాశ చెందకుండా రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా జనరల్ స్టడీస్ పేపర్‌ను సిద్ధం చేసుకుని మళ్లీ అందులోనే పట్టు సాధించింది.

ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ ప్రిపరేషన్ :
ఒకవైపు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువులను కొనసాగించింది. యూపీఎస్సీకి సిద్ధమైన సోనాల్ ప్రయాణం అందరికి స్ఫూర్తిదాయకం. ఆ సమయంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేసి పార్ట్‌టైమ్‌గా సీఎస్‌గా కూడా పనిచేస్తున్నారు. వీటన్నింటితో పాటు, యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా కొనసాగించారు.

రెండో ప్రయత్నంలో విజయం :
సోనాల్ రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది. అయితే, ఆమె మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిన రెండో ప్రయత్నంలో అదే సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించింది. ఆప్షనల్ వాణిజ్యం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కన్నా జనరల్ స్టడీస్‌లోనే ఎక్కువ మార్కులు సాధించింది.

సోనాల్ సందేశం ఇదే :
సోనాల్ తన యూపీఎస్సీ ప్రయాణం ద్వారా ఇతర అభ్యర్థులకు ఎంత ధైర్యంగా ఉండాలో సూచిస్తోంది. మీరు వెళ్లే మార్గాన్ని ఏ సమస్య అడ్డుకోలేదని బోధిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి వైఫల్యం మీరు నేర్చుకునే అంశాన్ని మెరుగుపరచగల గుణపాఠం కూడా. మీ సామర్థ్యాలను విశ్వసించండి.

మీ లక్ష్యాన్ని పూర్తి అంకితభావంతో ఉత్సాహంతో సాధించడానికి ముందుకు సాగండి. మీ కలను ఎప్పటికీ కోల్పోకండి. స్థిరత్వంతో ఏదైనా గొప్పతనాన్ని సాధించవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనాల్ గోయల్ సందేశం వైరల్ అవుతోంది. ఆమె మార్క్‌షీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనేక మంది ఆశావాదులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్త పరుస్తున్నారు.

Read Also : UPSC CSE 2024 : సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఐఎఫ్ఎస్ హిమాన్షు త్యాగి గోల్డెన్ టిప్స్.. ఒత్తిడిని ఇలా డీల్ చేయండి!