IFFCO Recruitment : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు దారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.31,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

IFFCO Recruitment : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in Indian Farmers Fertilizer Cooperative Limited

Updated On : November 4, 2022 / 7:49 PM IST

IFFCO Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఒరిస్సాలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ట్రైనీ (ఆపరేటర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌,కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఫెర్టిలైజర్‌,హెవీ కెమికల్ ఇండస్ట్రీ/పెట్రోలియం రిఫైనరీ,పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్‌ చేసి ఉండాలి.

దరఖాస్తు దారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.31,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ. 34,000ల నుంచి రూ.64,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 13, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iffco.in/en/corporate పరిశీలించగలరు.