AAP CM Candidate: గుజరాత్‭లో పంజాబ్ ఫార్ములా అమలు చేస్తున్న కేజ్రీవాల్.. ఆ నిర్ణయం ప్రజలకే..

తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్‭కు అనుకూలంగా ఎక్కువ మంది ప్రజలు సందేశాలు పంపారు. దీంతో ఎన్నికల ముందే ఆప్ అభ్యర్థి ఖరారు అయ్యారు. ఇక ఇదే ఫార్ములాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

AAP CM Candidate: గుజరాత్‭లో పంజాబ్ ఫార్ములా అమలు చేస్తున్న కేజ్రీవాల్.. ఆ నిర్ణయం ప్రజలకే..

Arvind Kejriwal launches campaign to select AAP cm candidate

Updated On : October 29, 2022 / 1:13 PM IST

AAP CM Candidate: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో నిర్ణయించాలని ప్రజా నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. వాస్తవానికి అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కొంత గందరగోళం ఉండేంది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకవేళ ఆప్ అధికారంలోకి వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని వదులుకుని కేజ్రీవాల్ పంజాబ్‭కు వస్తారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. కాగా ఈ యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో అదే అయోమయం చెలరేగింది. పైగా ఈ విషయమై విపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.

దీంతో.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్‭కు అనుకూలంగా ఎక్కువ మంది ప్రజలు సందేశాలు పంపారు. దీంతో ఎన్నికల ముందే ఆప్ అభ్యర్థి ఖరారు అయ్యారు. ఇక ఇదే ఫార్ములాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

గుజరాత్ అప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే నిర్ణయించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం రాష్ట్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని గుజరాతీలే నిర్ణయించాలని మేము అనుకుంటున్నాము. దీని కోసం మేము ఒక మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాం. మీకు నచ్చిన అభ్యర్థి పేరును మాకు మెయిల్, సాధారణ మెసేజ్ లేదంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిచొచ్చు’’ అని అన్నారు. 6357000360 అనే నంబరుతో పాటు aapnocm@gmail.com అనే ఈమెయిల్‭కు తమ అభిప్రాయాలు పంపాలని కేజ్రీవాల్ కోరారు.

Maharashtra: కీలక విపక్ష నేతలను భద్రతను కుదించిన మహారాష్ట్ర ప్రభుత్వం