BJP revisits its plans elections in five states: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి
భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది. ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ దృష్టి సారించింది...

BJP focus on elections
BJP focus on five state assembly elections: భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది.(After Karnataka loss) ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ దృష్టి సారించింది. కేంద్రపథకాలపై బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మోదీకి ధన్యవాదాలు పేరిట సమావేశాలు నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందించింది. ఎన్డీయేలో పాత మిత్రులను రంగంలోకి దించాలని బీజేపీ చూస్తోంది.
బీజేపీ అధికారంలో ఉన్నమధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ ఘడ్, బీఆర్ఎస్ అధికారంలో ఉనన తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర పథకాలపై ప్రచారం చేయడమే కాకుండా డబుల్ ఇంజిన్ సర్కారు ఔచిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
Netherlands Town Prohibits Beach: నెదర్లాండ్ బీచ్‌లో జంటలు ఆ పని చేయొద్దు..నిషేధ ఉత్తర్వులు
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఓటమి అనంతరం బీజేపీ కొత్త ప్రచార వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.కేంద్ర పథకాల గురించి కేంద్ర నాయకులు, కేంద్రమంత్రులతో మాట్లాడించాలని నిర్ణయించారు.ఉచిత విద్యుత్, పాత పెన్షన్ స్కీమ్‌ను మార్చడం వంటి వాగ్దానాలకు ప్రతిపక్షాల ప్రజాకర్షక హామీలను ఎదుర్కోనేలా బీజేపీ ప్రచారం చేయనుంది.హర్ ఘర్ నల్ లేదా పిఎం ఆవాస్ యోజన వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలు ప్రజలకు ఎలా సాధికారతను అందించాయో ఓటర్లకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది.