Assembly Elections 2023: కాంగ్రెస్‭కు కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయింది.. బీజేపీకి 15 సీట్లు మాత్రమే ఇస్తారట

చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు

Assembly Elections 2023: కాంగ్రెస్‭కు కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయింది.. బీజేపీకి 15 సీట్లు మాత్రమే ఇస్తారట

Updated On : October 15, 2023 / 8:05 PM IST

Assembly Elections 2023: ఛత్తీస్‭గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓపీనియన్ పోల్స్ అన్నీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చి చెప్పాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉన్నట్టుంది.

ఏకంతా 75 సీట్లు గెలుస్తామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఛత్తీస్‭గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రి తామ్రధ్వాజ్ సాహు తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో మేము 75 స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నాము. మా ప్రభుత్వం, పార్టీ ఆ దిశగా పని చేస్తున్నాయి. మా పని అంతా ‘అబ్కీ బార్ 75 పార్’ పైనే కేంద్రీకరించాము’’ అని అన్నారు.

చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమ సీఈసీ, స్క్రీన్‌ కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా టిక్కెట్లను రద్దు చేసి కొత్త వారిని కూడా అభ్యర్థులుగా చేశామని చెప్పారు. ఇదిలావుండగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ ఆదివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ తనను కోరిందని, తాను చిత్రకూట్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేస్తానని అన్నారు.