Rahul Gandhi: కులగణన మీద మొదటిసారి మాట్లాడిన రాహుల్ గాంధీ.. యూపీఏ డాటా విడుదల చేయాలంటూ మోదీకి డిమాండ్

ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు వెళ్లింది.

Rahul Gandhi: కులగణన మీద మొదటిసారి మాట్లాడిన రాహుల్ గాంధీ.. యూపీఏ డాటా విడుదల చేయాలంటూ మోదీకి డిమాండ్

Rahul Gandhi

Rahul Gandhi: చాలా రోజులుగా కులగణన చేపట్టాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి కానీ, కేవలం ఎస్సీ, ఎస్టీల కులగణన మాత్రమే జరుగుతోంది. అయితే ఓబీసీల జీవన స్థితిగతులను తెలిపే కులగణన జరగాలనే డిమాండ్ తాజాగా పెద్ద ఎత్తున పెరిగింది. అయితే దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టింది. ఈమధ్య కాలంలో మండల్ ఉద్యమ ప్రభావం ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు దీని గురించి మాట్లాడినప్పటికీ అధికార బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ పెదవి విప్పలేదు. అలాంటి ఉన్నట్టుండి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా కులగణన గురించి మాట్లాడారు.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ఆదివారం పర్యటించిన రాహుల్.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కులగణన గురించి మాట్లాడారు. వాస్తవానికి యూపీఏ హయాంలో కులగణన జరిగిందట. అయితే దాన్ని మోదీ ప్రభుత్వం బయటికి వెల్లడించడం లేదని రాహుల్ ఆరోపణ. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కులగణన డాటాను వెల్లడించాలని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ డిమాండ్ చేశారు. ఆ డాటా కనుక వెల్లడిస్తే ఓబీసీలు, దళితులు, గిరిజనుల జీవన స్థితిగతులు, రాజకీయంగా ఇతర రంగాల్లో వారి వాటాకు సంబంధించిన లెక్కలు బయటికి వస్తాయని రాహుల్ అన్నారు.

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు వెళ్లింది. మోదీ ఇంటి పేరు మీద చేసిన వ్యాఖ్యలను ఓబీసీలను అవమానించారనే దాని కింద అధికార పార్టీ ప్రచారం చేసింది. సరిగ్గా అదే ప్రాంతం నుంచి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఓబీసీ గణన గురించి ప్రస్తావించడం గమనార్హం.

US Secretary: ప్రధాని మోదీపై అమెరికా కార్యదర్శి ప్రశంసల జల్లు

‘‘ఓబీసీలు దళితులు గిరిజనుల గరించి మాట్లాడినప్పుడు ప్రధానంగా వచ్చే ప్రశ్నలు ఏంటి? మన దేశ జనాభాలో వీరే అతి ఎక్కువ సమూహం. అయితే సెక్రెటేరియట్లో వీళ్లు ఎంత మంది ఉన్నారో ఒకసారి చూడండి. కేవలం 7 శాతం మాత్రమే ఉన్నారు. అయితే ఓబీసీలు దళితులు గిరిజనుల సంఖ్య ఎంత అనేది కచ్చితమైన సమాచారం కావాలి. అలా అయితే రాజకీయంగా అయినా మరే ఇతర అంశాల్లో అయినా వారికి దక్కిన ప్రాధాన్యత ఏంతనేది బయటికి వెల్లడి అవుతుంది. 2011లో యూపీఏ ప్రభుత్వం కులగణన చేపట్టింది. దాన్ని మోదీ ప్రభుత్వం వెల్లడించాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. అంతే కాకుండా.. 50శాతం పెట్టిన రిజర్వేషన్ కోటాను ఎత్తివేసి, మరింత కోటాను పెంచాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్

ఇకే ఇదే సందర్భంలో కులగణన చేపట్టేందుకు బీజేపీ సముఖంగా లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్), సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, డిఎంకె వంటి పార్టీలు 50 శాతం కోటా పరిమితిని ఎత్తివేయాలని చేస్తున్న డిమాండ్‭ను రాహుల్ ప్రస్తావించారు. పరోక్షంగా విపక్షాల డిమాండుకు ఆయన మద్దతు ఇచ్చారు. అయితే 50 శాతం పరిమితిని తమిళనాడు రాష్ట్రం 90వ దశకంలో అధిగమించి ఎక్కువ రిజర్వేషన్ అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని సొంతంగానే కులగణన చేస్తామని ప్రకటించిన బిహార్ ప్రభుత్వం ఆ పని పూర్తి చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా కోటాను పెంచుతూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ కిందకు తీసుకురావాలని తీర్మానం చేసింది.