Uttam Kumar Reddy : రైతులను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కు లేదు
బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. రుణమాఫీ ఏకధాటిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతుల ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కు లేదని ఉత్తమ్ అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.