Weight Loss Tips: సింపుల్ గా స్లిమ్ అయ్యే అద్భుతమైన చిట్కా.. జస్ట్ ఇలా చేయండి.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది
Weight Loss Tips: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జిమ్ములు, వ్యాయామాలు, యోగాలు లాంటివి లేకుండా జస్ట్ వెల్లుల్లిని ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును మొత్తం కరిగించుకోవచ్చు.

Amazing tips that are simple without yoga and exercise
వెల్లుల్లి (Garlic) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దివ్యౌషధం. సుగంధ ద్రవ్యం. అది కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా బరువు తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అది కూడా సహజమైన రీతిలో. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జిమ్ములు, వ్యాయామాలు, యోగాలు లాంటివి లేకుండా జస్ట్ వెల్లుల్లిని ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును మొత్తం కరిగించుకోవచ్చు. మరి ఆ విషయాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వెల్లుల్లి వల్ల బరువు తగ్గడానికి కారణాలు
1.మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది:
వెల్లుల్లిలో ఉండే అలిసిన్ (Allicin) అనే యాక్టివ్ కాంపౌండ్ శరీరంలో మెటాబాలిజాన్ని పెంచుతుంది. మెటాబాలిజం పెరిగితే శరీరం వేగంగా కాలరీలను ఖర్చు చేస్తుంది. దానివల్ల ఫ్యాట్ నిల్వలు తగ్గుతాయి.
2. ఫ్యాట్ స్టోరేజీ తగ్గుతుంది:
వెల్లుల్లి కొన్ని ఎంజైమ్‌లను యాక్టివేట్ చేసి కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్(పొట్ట దగ్గర)ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
3.ఆకలిని నియంత్రిస్తుంది:
వెల్లుల్లి తినడం వలన అపెటైట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఆకలిని తగ్గించి అధికంగా తినే అలవాట్లను నియంత్రిస్తుంది. దానివల్ల సహజంగానే బరువు తగ్గవచ్చు.
4.డిటాక్స్ గుణాలు:
వెల్లుల్లి అనేది సహజమైన డిటాక్స్ ఏజెంట్. ఇది శరీరంలో విషతత్వాలను తొలగించడంలో మెరుగా పని చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా మారుతుంది.దీనివల్ల బరువు తగ్గే ప్రక్రియ సులభమవుతుంది.
5. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది:
వెల్లుల్లి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసి ఫ్యాట్ నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి వాడే మార్గాలు:
1.ఖాళీ కడుపుతో: రోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు నీటితో మింగడం వల్ల బరువు తగ్గవచ్చు.
2.వెల్లుల్లి, నిమ్మరసం: వెల్లుల్లి రెబ్బలను వేడినీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మెటాబాలిజాన్ని బాగా పెరుగుతుంది.
3.వెల్లుల్లి, తేనె: తేనెలో వెల్లుల్లి ముక్కలను కొన్ని గంటల పాటు నానబెట్టి తింటే ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గించవచ్చు.
జాగ్రత్తలు:
- వెల్లుల్లి ఎక్కువగా తింటే అజీర్ణం, వాసన వంటి సమస్యలు రావచ్చు.
- గర్భిణీలు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి.
- ఖాళీ కడుపు మీద తినేటప్పుడు మీ శరీర స్పందనను పరిశీలించాలి.