Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

ఆహారం అనేది ఆల్కహాల్ చిన్న ప్రేగులలోకి త్వరగా వెళ్ళకుండా నిరోధిస్తుంది. మద్యం త్రాగడానికి ముందు కడుపులో ఆహారం ఉన్నప్పుడు, ఆల్కహాల్ మరింత నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు, త్రాగే ఆల్కహాల్ చాలా త్వరగా కడుపు నుండి చిన్న ప్రేగులలోకి వెళుతుంది.

Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

drinking alcohol

Drinking Alcohol : ఇటీవలి కాలంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య అధికంగా ఉంది. పడుకోబోయే ముందు రెండు, మూడు పెగ్గులతో సరిపెట్టే వారు కొందరైతే రోజు మొత్తం మద్యం మత్తులో మునిగి తేలేవారు మరికొందరు. మద్యం గురించి చెప్పాలంటే బీర్లు, వైన్లు ఇలా రకరకాల ఆల్కహాల్ కంటెంట్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాల కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు శరీరంపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

READ ALSO : Italy Government : రాత్రి వేళల్లో ఫుల్‌గా మద్యం సేవిస్తే.. క్యాబ్‌లో ఉచితంగా ఇంటికి.. సరికొత్త పథకం ..

మద్యం సేవించినప్పుడు శరీరం ఆల్కహాల్‌ను ఎలా గ్రహిస్తుందో పరిశీలిస్తే మద్యం సేవిస్తున్నప్పుడు చాలా తక్కువ శాతం నోటిలోని నాలుకలోని చిన్న రక్త నాళాలలోకి వెళుతుంది. ఆల్కహాల్ కడుపులోకి చేరినప్పుడు, 20 శాతం వరకు రక్తంలోకి శోషించబడుతుంది. ఆల్కహాల్ చిన్న ప్రేగులోకి వెళ్ళినప్పుడు, మిగిలిన 75 నుండి 85 శాతం రక్తప్రవాహంలోకి నేరుగా చేరుతుంది.

రక్తప్రవాహాన్ని కాలేయం దానిని పూర్తిగా విచ్ఛిన్నం చేసే వరకు ఆల్కహాల్ రక్తప్రవాహంలో శరీరం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాలేయం రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. త్రాగే ఆల్కహాల్‌లో 80 నుండి 90 శాతం నీరు, కార్బన్ డయాక్సైడ్ , శక్తిగా విడదీస్తుంది, ఇది శరీరం ప్రాసెస్ చేస్తుంది. ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి కాలేయం ఎంజైమ్‌లను ఉపయోగిస్తుంది.

READ ALSO : Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?

మూత్రపిండాలు మీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. శరీరంలోని ద్రవాన్ని సమతుల్యం చేస్తాయి. మూత్రం రూపంలో శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. ఆల్కహాల్ ఫిల్టర్ చేసేందుకు మూత్రపిండాలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శరీరం 10 శాతం ఆల్కహాల్‌ను మూత్రం రూపంలో విసర్జిస్తుంది. ఆల్కహాల్ తాగిన తర్వాత 5 నుండి 10 నిమిషాల్లో రక్తప్రవాహం నుండి మెదడులోకి వెళుతుంది. ఆల్కహాల్ మానసిక స్థితి మార్పులకు కారణమవుతుంది. ఆలోచనలను సమన్వయం చేయటానికి మెదడు ఇబ్బందిపడుతుంది. ఊపిరితిత్తులలో, కొంత శాతం ఆల్కహాల్ శ్వాసగా ఆవిరైపోతుంది. ఒక వ్యక్తి తాను తీసుకునే ఆల్కహాల్‌లో 8 శాతం వరకు ఊపిరి పీల్చుకుంటుంది.

ఖాళీ కడుపుతో మద్యం సేవించటం వల్ల ఏంజరుగుతుంది;

మహిళలు, యువకులు ఆల్కహాల్ ను సేవించటం వల్ల ఆప్రభావం శరీరంలోని అవయవాలపై పడుతుంది. శరీరం ఆల్కహాల్‌ను ఎలా నిర్వహిస్తుందనే విషయంలో మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్కహాల్ చాలా త్వరగా చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది. పొట్టలో ఆల్కహాల్ ఎక్కువసేపు ఉంటుంది. అది నెమ్మదిగా గ్రహించబడుతుంది. తరువాత శరీరంపై ప్రభావం చూపుతుంది.

READ ALSO : Odisha : మద్యం మత్తులో సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేసిన వ్యక్తి వీడియో వైరల్

ఆహారం అనేది ఆల్కహాల్ చిన్న ప్రేగులలోకి త్వరగా వెళ్ళకుండా నిరోధిస్తుంది. మద్యం త్రాగడానికి ముందు కడుపులో ఆహారం ఉన్నప్పుడు, ఆల్కహాల్ మరింత నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు, త్రాగే ఆల్కహాల్ చాలా త్వరగా కడుపు నుండి చిన్న ప్రేగులలోకి వెళుతుంది. ఇక్కడ ఎక్కువ భాగం రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఖాళీ కడుపుతో సేవించటం వల్ల శరీర కదలికలను, మెదడు ఆలోచనా శక్తి సామర్థ్యం వంటి దుష్ప్రభావాలను తీవ్రతరం చేస్తుంది. ఖాళీ కడుపుతో పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తాగడం చాలా ప్రమాదకరం. తీవ్రమైన హానిని కలిగిస్తుంది. ఆల్కహాల్ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది.

మద్యం తాగుతూ ఉప్పుతో కూడిన స్నాక్స్ తింటున్నారా ?

మద్యం తాగుతున్నప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే, ఉప్పు కలిపిన స్నాక్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఉప్పు కారణంగా శరీరంలో డిహైడ్రేషన్ పెరిగే అవకాశం ఉంది. ఉప్పుతో కూడిన చిరుతిండి తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఇంకా పెరుగుతుంది. ఆల్కహాల్ తాగడానికి ముందు పండ్లు, కూరగాయలు వంటివి తినటం పండ్లు తినడం, దోసకాయ, టమోటోలు, క్యాప్సికం, ముల్లంగి, అరటి కాయ వంటి వాటితో వండిన వంటలను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Vegetable Cultivation : కూరగాయ నారుమడిలో తెగుళ్ల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

అదే సమయంలో ఆల్కహాల్ గాఢతను తగ్గించడానికి మద్యంలో కొంత శాతం నీటిని చేర్చుకోవటం మంచిది. అలాగే ఒకేసారి తాగకుండా కొద్దికొద్దిగా సిప్ చేస్తుండాలి. తాగటానికి ఒక గంట ముందు ఆహారం తీసుకోవటం మంచిది. కొంతమందిలో ఖాళీ కడుపుతో మద్యపానం కడుపు నొప్పి లేదా వికారం వంటి సమస్యలకు దారితీస్తుంది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మద్యపానం చేస్తే ఆరోగ్యాన్ని కొంతైనా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరమన్న విషయం గుర్తుంచుకోవాలి. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.