Sleep Banking: స్లీప్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ తో ప్రశాంతమైన నిద్ర.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే?

నిద్రకు అంతరాయం, అలసట వస్తుంది. కాబట్టి, అలాంటి సమయాలను ముందే గుర్తించి నిద్రకు అంతరాయం కలగకుండా చేసుకోవడమే స్లీప్ బ్యాంకింగ్.

Sleep Banking: స్లీప్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ తో ప్రశాంతమైన నిద్ర.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే?

Sleep banking benefits

Updated On : June 14, 2025 / 11:33 AM IST

మనం సాధారణంగా డబ్బును సేవ్ చేసుకోవడం చూస్తుంటాం. అవసరం ఉన్నప్పుడు ఖర్చు చేసుకుంటాం. కానీ, నిద్రను కూడా సేవ్ చేసుకోవచ్చని తెలుసా మీకు. సేవ్ చేసుకోవడం మాత్రమే కాదు దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవచ్చట కూడా. అదే స్లీప్ బ్యాంకింగ్. ప్రస్తుతం ఈ పద్దతి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మరి ఈ స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలుం ఏంటి? దాని ఎలా పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిత్యా జీవితంలో మనకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి. వాటిని పక్కాగా ప్లాన్ చేసుకుంటాం. కానీ, కొన్ని అనుకోకుండా వచ్చే పనుల వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దానివల్ల నిద్రకు అంతరాయం, అలసట వస్తుంది. కాబట్టి, అలాంటి సమయాలను ముందే గుర్తించి నిద్రకు అంతరాయం కలగకుండా చేసుకోవడమే స్లీప్ బ్యాంకింగ్.

ఉదాహరణకు మీకు వచ్చే వారం అంతా బిజీ షడ్యూల్ ఉందనుకో. దానికి వారం రోజుల ముందు నుండే స్లీప్ బ్యాంకింగ్ పద్దతిని ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే సాధారణంగా మీకు 7 గంటలు నిద్ర పోతే ఈ ప్లానింగ్ లో ఒక గంట ఎక్కువగా నిద్ర పోవాలి. అలా చేస్తే రానున్న అలసటభరితమైన రోజుల్లో నిద్రలేమి వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. శరీరానికి కావాల్సిన శక్తిని ముందే అందించినట్లవుతుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం తక్కువగా ఉంటుంది. చాలా మంది దీనిని సోమరితనంగా భావిస్తారు. కానీ, స్లీప్ బ్యాంకింగ్ అనేది శరీరం మెదడు రెండింటికీ ముందుగానే సపోర్ట్ ఇచ్చే తెలివైన పద్ధతి. ఇది శాస్త్రీయంగా గుర్తింపు కూడా పొందుతోంది. చాలా సింపుల్.. మనం ముందే నిద్రకు ప్రాధాన్యతనిస్తే.. రానున్న ఒత్తిడిని తేలికగా ఎదుర్కొనవచ్చు. కాబట్టి, స్లీప్ బ్యాంకింగ్ పద్దతిని అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.