Bread: వామ్మో.. బ్రెడ్ ఇంత డేంజరా? తింటే ఆ జబ్బు ఖాయం? షాకింగ్ విషయాలు చెప్పిన సచిన్, అంబానీల హెల్త్ కోచ్…

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బ్రెడ్ అక్షరాలా మిమ్మల్ని చంపగలదు. కాబట్టి బ్రెడ్‌ను పూర్తిగా నివారించడం గురించి ఆలోచన చేయండి.

Bread: వామ్మో.. బ్రెడ్ ఇంత డేంజరా? తింటే ఆ జబ్బు ఖాయం? షాకింగ్ విషయాలు చెప్పిన సచిన్, అంబానీల హెల్త్ కోచ్…

Updated On : May 6, 2025 / 9:11 PM IST

Bread: మీలో చాలామంది ప్రతి రోజూ అల్పాహారంగా బ్రెడ్ తింటుంటారు. ఇది చాలా కామన్. పొద్దునే టిఫిన్ బదులు బ్రెడ్ తినేసి పనులకు వెళ్లిపోయే వాళ్లు చాలామందే ఉన్నారు. బ్రెడ్ జామ్ లేదా బ్రెడ్ పాలు తీసుకోవడం సర్వ సాధారణం. కానీ, బ్రెడ్ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా.. ఈ విషయం తెలిస్తే.. ఇకపై అస్సలు బ్రెడ్ ముక్క జోలికే వెళ్లరేమో. బ్రెడ్.. దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో.. సచిన్ టెండూల్కర్, అంబానీల హెల్త్ కోచ్ డాక్టర్ మిక్కీ మెహతా తెలియజేశారు. అంబానీ, సచిన్ సహా అనేక మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు వెల్‌నెస్ కోచ్‌గా ఉన్నారు మిక్కీ మెహతా. బ్రెడ్ దుష్ప్రభావాల గురించి ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

“మీరు ప్రతిరోజూ బ్రెడ్ తింటే మీ పేగు గట్టర్‌గా మారుతుంది” అని మిక్కీ మెహతా హెచ్చరించారు. మీ రోజువారీ బ్రెడ్ తినే అలవాటును పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

రోజువారీ బ్రెడ్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు..
”భారతీయులు ఉదయం దిన చర్యలో భాగంగా బ్రెడ్ తినడం సర్వ సాధారణం. బ్రెడ్ ను చాలామంది అల్పాహారంగా తీసుకుంటారు. నేను టీ బ్రెడ్ తిన్నాను, నేను ఆమ్లెట్ బ్రెడ్ తిన్నాను, నేను జామ్ బ్రెడ్ తిన్నాను, నేను పోహా బ్రెడ్ తిన్నాను అని చాలామంది చెబుతుంటారు. అయితే, వైట్ బ్రెడ్ మీ హెల్త్ కు అత్యంత ప్రమాదకరమైనది. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ బారిన పడతారు. ఇది నేను ఇటీవల నా కుమార్తెతో ఎదుర్కొన్న సమస్య. ఆమెకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించడం ప్రారంభించింది. దానిని “మద్యం తాగినంతగా” అనిపిస్తుందని ఆమె వర్ణించింది.

Also Read: బాబోయ్.. షాంపూలు, కర్టెన్స్‌లోని ఈ విష రసాయనం మీ ప్రాణాలకే ప్రమాదం..!- షాకింగ్ స్టడీ..

మొదట్లో, నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరుసటి రోజు, పరిస్థితులు మరింత తీవ్రమైన మలుపు తిరిగాయి. నా కూతురిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అంతా సాధారణ స్థితికి చేరుకుంది. ఎందుకిలా జరిగిందా అని ఆరా తీస్తే.. ఆమె పెద్ద మొత్తంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తింటున్నట్లు గ్రహించాం. దీని ఫలితంగా “ఆటో బ్రూవరీ సిండ్రోమ్” అని పిలిచే వ్యాధికి దారితీసింది” అని వివరించారు మెహతా.

ఏంటీ..ఆటో బ్రూవరీ సిండ్రోమ్..
ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే.. జీర్ణం కాని బ్రెడ్ ఇథనాల్ లేదా ఆల్కహాల్ గా మారుతుంది. ఇది మీరు ఎక్కువగా ఆల్కహాల్ తాగినప్పుడు మీకు కలిగే అనుభూతిని ఇస్తుంది. డాక్టర్ మెహతా తన అనుచరులను వారి బ్రెడ్ తినే అలవాటును పునరాలోచించుకోవాలని కోరారు. “ఇది ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ను నివారిస్తుందన్నారు. బ్రెడ్ అక్షరాలా మిమ్మల్ని చంపగలదు. కాబట్టి బ్రెడ్‌ను పూర్తిగా నివారించడం గురించి ఆలోచన చేయండి. బ్రెడ్ కాల్చి తిన్నా మామూలుగానే తిన్నా.. మీ పేగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని హెచ్చరించారు.

పరిష్కారం ఏమిటి?
మీరు బ్రెడ్ తినడం పూర్తిగా మానేయలేకపోతే.. చాలా ఆకలిగా ఉన్నప్పుడు, మరేమీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే బ్రెడ్ తినమని డాక్టర్ మెహతా సూచిస్తున్నారు. ఇసాబ్గోల్ (సైలియం పొట్టు) ను మీ దినచర్యలో చేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేస్తున్నారు. “ఇసాబ్గోల్ రాత్రిపూట లేదా ఉదయం పూట తినొచ్చు. ఇసాబ్గోల్ మీ పేగులను శుభ్రపరచడానికి, బ్రెడ్‌ను బయటకు నెట్టడానికి సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు.

Also Read: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ తింటే క్యాన్సర్..! తాజా అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు..

ఏంటీ ఇసాబ్గోల్..?
మలబద్ధక సమస్యతో బాధపడే వారి కోసం ఓ సూపర్ ఫుడ్ ఉంది. అదే ఇసాబ్గోల్ పొట్టు. ఇది గోధుమలను పోలి ఉంటుంది. దీనిని సైలియం పొట్టు అని కూడా ఉంటారు. ఇదొక డైటరీ ఫైబర్. ఇది మలబద్ధకం కోసం సాధారణంగా ఉపయోగించే ఇంటి నివారణలలో ఒకటి. ఇసబ్గోల్ పొట్టు ఒక సహజ ఔషధం. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయం, పొట్ట, గుండె సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అన్ని జీర్ణ సమస్యలను అధిగమించేందుకు ఇది దివ్యౌధంలా పని చేస్తుంది. ఇసబ్గోల్ పొట్టును పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.