షాకింగ్ : ఇంట్లో నీళ్ల పైపుల ద్వారా కరోనా వైరస్ వస్తోంది!

కరోనా వైరస్ గాలి ద్వారానే కాదు.. పైపుల ద్వారా కూడా వస్తోంది. హాంగ్ కాంగ్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఆ భవనంలో ఉండే ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించింది. ఇంట్లో నుంచి వారిద్దరూ కాలు బయట పెట్టలేదు. కనీసం ఒకరినొకరు కూడా కలుసుకోనూ లేదు. ఎవరి ఫ్లోరలో వారే ఉన్నారు.
అయినా వారికి కరోనా వైరస్ సోకింది. అదేలా సాధ్యమని అధికారులు తలలు పట్టేసుకుంటున్నారు. సాధారణంగా గాలిద్వారా వ్యాపించే అవకాశం ఉందంటే.. వారిద్దరూ ఒకేచోట లేరు. దూరంగా వారి ప్లాట్లలో వారు ఉన్నారు. మరి ఎలా వైరస్ ఆ ఇద్దరికి ఒకేసారి సోకి ఉండొచ్చు అన్నదే ప్రశ్న అందరిలో మొదలైంది.
కొత్త రిపోర్టుల ప్రకారం.. కరోనా వైరస్ ఆ అపార్టమెంట్ లోని నీళ్ల పైపుల ద్వారా వ్యాపించి ఉండొచ్చునని షాకింగ్ న్యూస్ చెప్పాయి. ఫిబ్రవరి 11న మంగళవారం హాంగ్ కాంగ్ లోని టిసింగ్ వై ఏరియాలోని ఓ అపార్ట్ మెంటులో వందలాది మంది ఉంటున్నారు.
ఈ భవనంలో ఒకరికి కరోనా (COVID-19) వైరస్ సోకడంతో అక్కడి వారందరిని ఖాళీ చేయించారు. 100కు పైగా నివాసితులను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలో ఉంచారు. అదే భవనంలో నివసించే 62ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో అపార్ట్ మెంటులో వైరస్ సోకిన రెండో వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
భవనంలో వైరస్ సోకిన తొలి వ్యక్తికి 10 ఫోర్ల కింద వృద్ధురాలు ఉంటోంది. ఎక్కడో పది అంతస్థుల కింద ఉన్న వృద్ధురాలికి ఎలా వైరస్ సోకింది అనే ప్రశ్న మళ్లీ తలెత్తోంది. దీనికి ఒకటే మార్గం.. భవనం మౌలిక సదుపాయల్లో ఏర్పాటు చేసిన వాటర్ పైపుల నుంచే వైరస్ సోకి ఉండొచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వైరస్ సోకిన వృద్ధురాలు ఉండే ప్లాట్‌లోని బాత్ రూంలో ఓపెన్ చేసిన ఓ పైపును అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరు నివాసితులకు ఎలా వైరస్ సోకిందో కచ్చితమైన ఆధారాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.