కరోనా దెబ్బకు ఇంటిపట్టునే సెలబ్రెటీలు.. ఇదే సరైన సమయమని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు 

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 11:32 AM IST
కరోనా దెబ్బకు ఇంటిపట్టునే సెలబ్రెటీలు.. ఇదే సరైన సమయమని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు 

Updated On : March 22, 2020 / 11:32 AM IST

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోతోంది. ప్రపంచదేశాల్లో ఎక్కడికెక్కడ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు జనసంచారం లేకుండా లాక్ డౌన్ చేస్తున్నాయి ఆ దేశ ప్రభుత్వాలు.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ మూతపడ్డాయి. ఇంటికే పరిమితమైపోతున్నారు. ఇంట్లోనుచే పనిచేస్తున్నారు. ఎవరికివారూ ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ కావాలని సూచిస్తున్నారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, దుకాణాలు అన్నిమూతపడ్డాయి. టీవీషోలు కూడా నిలిచిపోయాయి.
Plastic Surgery

సినిమాలు, సీరియల్స్, షూటింగ్ అన్నీ నిలిచిపోయాయి. సెలబ్రెటీలు సైతం ఇంటికే పరిమితమైపోతున్నారు. బయటకు ఎక్కడికి వెళ్లడం లేదు. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రేటీలకు సెల్ఫ్ ఐసోలేషన్ బాగా కలిసొస్తోంది. వరుస షూటింగ్ షెడ్యూళ్లతో క్షణం తీరిక లేని సెలబ్రేటీలంతా పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ప్రత్యేకించి ప్లాస్టిక్ సర్జరీలకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారంతా.. ఎలాగో షూటింగ్స్ లేవు.. ఎన్నిరోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందో తెలియదు.. కరోనా పుణ్యామాని ప్లాస్టిక్ సర్జరీలకు కలిసొచ్చిందని సెలబ్రెటీలంతా ఖుషీ అయిపోతున్నారు. 
plastic surg

కరోనా ఐసోలేషన్ సమయానికి ప్లాస్టిక్ సర్జరీలకు వినియోగించుకునే పనిలో పడ్డారట.. యూనిటైడ్ స్టేట్స్‌లో హాలీవుడ్ సెలబ్రెటీలంతా సొంతంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేందుకు క్యూ కట్టేస్తున్నారు. మీరు వింటున్నది నిజమే అంటున్నారు ప్లాస్టిక్ సర్జన్, కో-హోస్ట్ Botched టెర్రీ డ్యుబ్రో.. ప్రస్తుతం ఇది హాలీవుడ్ సెలబ్రెటీలకు క్రిస్మస్ వెకేషన్ లాంటిదన్నారు. 

అమెరికాలో ప్రత్యేకించి Beverly Hills నుంచి సెలబ్రెటీలు, హైప్రొఫైల్స్ వారి నుంచి ప్లాస్టిక్ సర్జరీ కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎందుకంటే కరోనా వ్యాప్తితో Beverly Hills మొత్తం ఇప్పుడు షట్‌డౌన్ అయింది. బ్యూటీ ట్రీట్ మెంట్స్ లేదా కాస్మిటిక్ సర్జరీలకు అనుమతి లేదు.
plastic surgery

బ్యూటీ ట్రీట్ మెంట్ క్లినిక్ లు కూడా మూతపడ్డాయి. కానీ, ఆరేంజ్ కౌంటీలో మాత్రమే తెరిచి ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకే తమ దగ్గరకు సెలబ్రెటీలు, హైప్రొఫైల్స్ వారంతా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారని అంటున్నారు. మూవీలకు బ్రేక్ పడటంతో వీరంతా ఖాళీ సమయాన్ని ప్లాస్టిక్ సర్జరీలకు కేటాయించాలని భావిస్తున్నట్టు టెర్రీ డ్యుబ్రో తెలిపారు. 

plastic surgery

మరోవైపు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించు కునేందుకు ప్లాన్ చేస్తున్నారంట.. సినిమా షూటింగ్ లు ఎలాగో లేవు.. ఇంట్లోనే ఐసోలేషన్ కావడంతో ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న ప్లాస్టిక్ సర్జరీలకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారంట..  కొంతమంది సెలబ్రెటీలు ప్లాస్టిక్ సర్జన్లను నేరుగా ఇంటికి పిలుపించు కుంటున్నారు. వీడియో చాట్ ద్వారా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.