వ్యాక్సిన్ చరిత్రలో అద్భుతం…4నెలల్లో కరోనా వైరస్ కు సమర్థమైన వ్యాక్సిన్

చైనాలో మొదలై ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా 16 వారాల్లో సమర్థమైన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది నాలుగు నెలల పాటు జరిగే క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. కోయలేషన్ ఫర్ ఎపిడిమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్(CEPI) హెడ్ మాట్లాడుతూ… ఈ వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం అనేది వ్యాక్సిన్ చరిత్రలో ఓ అపూర్వమైనదిగా మిగిలిపోనుందన్నారు.
భవిష్యత్ అంటువ్యాధులను అరికట్టడానికి కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి 2017 లో ప్రారంభించిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యమైన CEPI…బ్రిటన్ మరియు ప్రపంచదేశాల్లో కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చేస్తున్న కృషికి నిధుల సహాయంగా యూకే ప్రభుత్వం 20 మిలియన్ల యూరోలను సీఈపీఐకి విడుదల చేసింది. యూకేలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి పశ్చిమ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఎబోలా వైరస్ వ్యాప్తికి ప్రతిస్పందనగా CEPI మొదట సృష్టించబడింది. నార్వే దేశరాజధాని ఓస్లోలో సీఈపీఐ ప్రధాన కార్యాలయం ఉంది.
CEPI యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ రిచర్డ్ హాట్చెట్ మాట్లాడుతూ… కరోనా వైరస్ ఆవిర్భావానికి ప్రతిస్పందించడానికి ప్రపంచం పరుగులు తీస్తున్న కీలకమైన సమయంలో ఈ డబ్బులు వచ్చాయని సీఈపీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ రిచర్డ్ హట్చెచ్ అన్నారు. వేగంగా ప్రపంచమంతా విస్తరించడం,అసమానమైన సాంక్రమిక లక్షణాలున్న కరోనా వైరస్ చాలా లోతుగా దృష్టిపెట్టాల్సినదని ఆయన తెలిపారు. భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని, 16 వారాలలో వ్యాధికారక జన్యు శ్రేణి నుండి క్లినికల్ టెస్టింగ్ వరకు పరిశోధనాత్మక వ్యాక్సిన్ పొందవచ్చుని అన్నారు.
పరిశోధనాత్మక వ్యాక్సిన్ల సేఫ్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి క్లినికల్ ట్రయల్స్ యొక్క ప్రారంభ దశ, రెండు నుండి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మక టైమ్ లైన్. నిజానికి వ్యాక్సిన్ అభివృద్ధి రంగంలో ఇది అపూర్వమైనదని ఆయన అన్నారు. ఒకవేళ తాము విజయం సాధించినప్పటికీ ఎలాంటి గ్యారెంటీ ఉండదు. వ్యాక్సిన్లు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ముందు నావిగేట్ చేయడానికి మరిన్ని సవాళ్లు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు.
కరోనా వైరస్ కు ప్రపంచ ప్రతిస్పందనకు మద్దతుగా వేగంగా పరిశోధన చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ మరియు యుకె రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్వాంగోల మధ్య బ్రిటన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మరియు అంటు వ్యాధుల వంటి భయాల నుంచి నుండి దేశం ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్ట్ కోసం గత వారం యూకే ప్రభుత్వం. 58.7 మిలియన్ యూరోల నిధుల పెంపును ప్రకటించింది.