కోవిడ్ – 19 (కరోనా)..రాకూడదంటే ఇలా చేయొద్దు!

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 05:29 AM IST
కోవిడ్ – 19 (కరోనా)..రాకూడదంటే ఇలా చేయొద్దు!

Updated On : March 21, 2020 / 5:29 AM IST

కోవిడ్ – 19 మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలో 258 కేసులు నమోదు కాగా..ఐదుగురు మృతి చెందారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉండొద్దని..వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు తప్పకుండా కడుక్కోవాలని సూచిస్తున్నారు. అయితే..కొంతమంది వీటిని పాటించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. 

సిగరేట్ షేరింగ్ : – 
ఉదయాన్నే చాలా మందికి ఛాయ్ తాగడం అలవాటు. కొంతమంది ఇంట్లో తయారు చేసుకుని ఛాయ్ తాగితే..మరికొంతమంది హోటళ్లలో ఛాయ్ తాగుతుంటారు. ఓ వైపు ఛాయ్ తాగుతూనే..మరో చేత్లో సిగరేట్ పొగ వదులుతుంటారు. ఒక సిగరేట్ వెలిగించి..షేర్ చేసుకొనే పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తుంటుంది. ఎక్కువగా కేఫ్‌లు ఇందుకు వేదిక అవుతుంటాయి. ఛాయ్ తాగి ఓ సిగరేట్ వెలిగించి..తలో రెండు పఫ్‌లు వెలిగించి వెళ్లిపోతుంటారు. ఈ ఎంగిలి ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు. 

గాజు గ్లాసుల్లో టీ : –
ఇక ఛాయ్ విషయానికి వస్తే…షాపుల్లో..టీ కొట్టు వారు..గాజు గ్లాసుల్లో టీ పోసిస్తుంటారు. పెద్ద కేఫ్‌లలో ఎప్పుడూ చూసినా రద్దీ ఉంటుంది. నిత్యం వందల కప్పులు ఛాయ్ ఖర్చవుతుంటుంది. వేడినీటిలో మునిగేలా గాజు గ్లాసులు వేస్తుంటారు. ఈ గ్లాసులను సరిగ్గా శుభ్రం చేయరనే వాదన ఉంది. దీంతో ఒకరు తాగిన గ్లాసులో మరొకరికి పోసి ఇస్తుంటారు. తాము శుభ్రంగానే ఇస్తామని అంటున్నా..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా డేంజర్ అంటున్నారు కొంతమంది. 

వదిలేసిన బిస్కెట్లు, సమోసాలు : – 
కేఫ్..ఇతర చిన్న హోటళ్లలో సమోసాలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు పెడుతుంటారు. కావాల్సిన వారికి చిన్న ప్లేట్‌లలో వీటిని వేసి ఇస్తుంటారు. అందులో కొందరు కొన్ని మాత్రమే తిని..మిగతావి వదిలేస్తుంటారు. వీటిని ఆ వ్యాపారస్తుడు తీసుకుని..ఇతరులకు పెడుతుంటారు. ఇక్కడ చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా వైరస్ విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. 

కేఫ్‌లలో రద్దీ : – 
అదే కేఫ్..హోటళ్లలో చాలా మంది కూర్చొంటారు. ఒకరికి తగిలేలా మరొకరు కూర్చొవడం వల్ల ప్రమాదమేనంటున్నారు. వీలైనంత వరకు బయటి ఫుడ్‌కు దూరంగా ఉంటేనే మంచిందంటున్నారు వైద్యులు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయడం..తయారు చేసే వారు కనీస జాగ్రత్తలు తీసుకుంటారన్న నమ్మకం లేదు. సో..ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడం వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిదిని వైద్యులు సూచిస్తున్నారు. 

See Also | వైట్ హౌస్‌ని తాకిన కరోనా, తొలి కేసు నమోదు