మనుషులపై ప్రయోగదశలో కరోనా వ్యాక్సిన్

మనుషులపై ప్రయోగదశలో కరోనా వ్యాక్సిన్

Updated On : March 17, 2021 / 5:23 PM IST

దేశమంతా కొవిడ్ 19కు మందు కనిపెట్టే ప్రక్రియలో భాగంగా ఆదివారం కేంద్రం హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మహమ్మారి ముగింపు కోసం వ్యాక్సిన్ టెస్టుల ఆరంభం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిద్ధం చేయనుంది.

ఐసీఎమ్మార్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సంయుక్తంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొంది పరీక్షలకు సిద్దం చేస్తున్నారు. కొవాక్సిన్ పనితీరుపై మినిస్ట్రీ మాట్లాడుతూ.. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాక్సిన్ ఇండియన్ పేషెంట్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ద్వారా వైరస్ మనిషి నుంచి ఐసోలేట్ అవడానికి వ్యాక్సిన్ తయారీలో సహాయపడింది.

కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ అధికారుల నుంచి జైడస్ అప్రూవల్ పొంది మనుషులపై ప్రయోగంలో ఉందని తెలిపింది. 140 మందిలో 11 మంది హ్యూమన్ ట్రయల్ పేజ్ లో అడుగుపెట్టారు.వ్యాక్సిన్ తయారుచేయడంలో ప్రపంచంతో పాటు ఇండియా రోల్ అనేది కీలకంగా మారింది. గడిచిన సంవత్సరాల్లో ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడమే కాకుండా.. ఇండియన్ మ్యాన్యుఫ్యాకచ్రర్స్ లో 60శాతం వ్యాక్సిన్లు యూనిసెఫ్ కు సప్లై చేస్తుంది.