Curry Leaves Benefits: కరివేపాకు తో మెరుగైన ఆరోగ్యం.. షుగర్ కంట్రోల్.. కళ్లకు మేలు, జట్టుకి బలం.. ఇంకా చాలానే ఉన్నాయి
Curry Leaves Benefits: కరివేపాకు లో ఉండే ఫైబర్, విటమిన్లు జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది ఆమ్లపీడనాన్ని తగ్గించి గ్యాస్, అజీర్ణం, మలబద్దకం లాంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Health benefits of eating curry leaves daily
భారతీయ వంటకాల్లో సువాసనను అందించే ముఖ్యమైన పదార్థాల్లో కరివేపాకు ఒకటి. ఇది మన ఆహారానికి రుచిని, సువాసనను ఇస్తుంది. చాలా మంది కరివేపాకును ఇష్టంగా తుంటే కొంతమంది మాత్రం పక్కన పడేస్తారు. నిజానికి అలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను కోల్పోతున్నాం అని అర్థం. కరివేపాకు కేవలం సువాసన, రుచి కోసం మాత్రమే కాదు, దీనిని రోజువారి ఆహరంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణులు సైతం ఇదే మాట చెప్తున్నారు. దీనికి సహజసిద్ధమైన ఔషధగుణాలు ఉన్నాయి కాబట్టి నిపుణులు కరివేపాకును “ఆయుర్వేద ఔషధం”గా భావిస్తారు. మరి లాంటి గుణాలు ఉన్న కరివేపాకు గురించి, అది అందించే ఆరోగ్యప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.జీర్ణాశయానికి మేలు:
కరివేపాకు లో ఉండే ఫైబర్, విటమిన్లు జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది ఆమ్లపీడనాన్ని తగ్గించి గ్యాస్, అజీర్ణం, మలబద్దకం లాంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
2.కంటి ఆరోగ్యం:
కరివేపాకు లో విటమిన్ A పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి దృష్టిని మెరుగుపరచడంతోపాటు కంటి లోలత, దృష్టిమండల తేడాలు వంటి సమస్యల నివారణకు సహాయపడుతుంది.
3.రక్త శుద్ధికి తోడ్పడుతుంది:
కరివేపాలో రక్తాన్ని శుభ్రపరచే గుణం కూడా ఉంది. ఇది టాక్సిన్స్‌ను తొలగించి, శరీరాన్ని స్వచ్ఛంగా తయారుచేస్తుంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.
4.మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
కరివేపాకు రక్తంలో షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని జైతిక పదార్థాలు గ్లూకోజ్‌ని కణజాలాలలోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది. దానివల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
5.జుట్టు పెరుగుదలకి మేలు:
కరివేపాకు జుట్టు పెరుగుదలకు శ్రేష్ఠమైన హర్బల్ టానిక్ అని చెప్పొచ్చు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనెతో కలిపి కరివేపాకు నూనె కలిపి తలకి పట్టిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
6.రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కరివేపాకు లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ C లాంటి పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
7.ఒత్తిడి తగ్గిస్తుంది:
కరివేపాకు లో ఉండే కొన్ని రసాయనిక పదార్థాలు నాడీ వ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
కరివేపాకును ఉపయోగించే విధానాలు:
- తాజా కరివేపాకును వంటల్లో వాడుకోవచ్చు
- పొడి చేసి ఆహార పదార్థాల్లో కలిపి వాడవచ్చు
- కరివేపాకు నూనెను జుట్టుకు వాడుకోవచ్చు
- కరివేపాకు టీ చేసి తీసుకోవచ్చు