Secondhand Smoke : ‘సెకండ్ హ్యాండ్ స్మోక్’ అంటే తెలుసా? దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే…
పొగ తాగే వారి కంటే దానిని పీల్చే వారికి చాలా ప్రమాదం అని చెబుతారు. దానినే 'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్; అంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చాలామందికి తెలియదు.

Secondhand Smoke
Secondhand Smoke : ధూమపానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో చాలామందికి తెలుసు. స్మోక్ చేయకపోయినా సిగరెట్ కాలుస్తున్న వారి నుంచి వచ్చే పొగవల్ల పీల్చడాన్ని ‘సెకండ్ హ్యాండ్ స్మోకింగ్’ అంటారు. ఇలా పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామందికి తెలియకపోవచ్చును.
Effects of Smoking : చర్మం, జుట్టు , కంటి ఆరోగ్యంపై ధూమపానం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
సెకండ్ హ్యాండ్ స్మోక్ కారణంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువట. గర్భిణులు ఈ పొగ పీల్చడం వల్ల కడుపులో ఉన్న శిశువు అకస్మాత్తుగా మరణించే ప్రమాదం కూడా ఉందట. ఊపిరితిత్తులు, చెవులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఉందట. సడెన్‌గా ఆస్తమా అటాక్ చేయడం వంటివి కూడా పొగ పీల్చడం వల్ల జరుగుతాయట. 1964 నుంచి చూస్తే ఇప్పటి వరకూ ధూమపానం చేయని ప్రజలు కోట్ల సంఖ్యలో అనారోగ్యాలతో మరణించినట్లు కొన్ని సర్వేలు చెప్పాయి.
సెకండ్ హ్యాండ్ స్మోక్ పిల్లల్లో మరింత ప్రభావం చూపుతుందట. న్యుమోనియా, బ్రోన్కైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల పెరుగుదల తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉంటాయట. పొగతాగే పెద్దల చుట్టూ తిరిగే పిల్లల్లో ఆస్తమా అటాక్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట. ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికంటే పీల్చేవారికే ఎక్కువ ఇబ్బందులు అనే మాట విని ఉంటారు కానీ.. ఇంతటి ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామందికి తెలియదు. కాబట్టి ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులు పొగతాగుతున్న సందర్భాల్లో వారికి దూరంగా ఉండటం చాలా మంచిది.