కరోనాను తరిమికొట్టిన కేరళ 5 వ్యుహాలు ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బెంబేలిత్తిస్తోంది. ఇప్పడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన ఓ టెకీ సహా ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. ఎంతమందికి ఈ కరోనా సోకిందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మందులేని కరోనాను ఎదుర్కొవడం ఎంతవరకూ సాధ్యమనేది అంతుపట్టడం లేదు. గతనెలలో కేరళ రాష్ట్రంలో కూడా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.
అదృష్టవశాత్తూ ఆ ముగ్గురిలో ఎవరూ వైరస్ కారణంగా మరణించలేదు. ఇప్పటివరకూ ఒక సింగిల్ డెత్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో లైవ్ మింట్ రిపోర్టులో తెలిపింది. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రధానంగా 5 మార్గాలను ఎంచుకుంది. గత రిపోర్టులతో పాటు నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం.. కేరళ ప్రభుత్వం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఎలాంటి చర్యలను చేపట్టిందో తెలుసుకుందాం.
1. వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించడం :
నిఫా వైరస్ ప్రబలిన రోజుల్లో ఎలా పోరాడిందో కేరళ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. 2018, 2019 రెండు సంవత్సరాల్లో రాష్ట్రం ప్రాణాంతక నిఫా వైరస్ వ్యాపించినప్పుడు కూడా ఇదే స్ఫూర్తిదాయకంగా పనిచేసింది. వైరస్ సోకిన వ్యక్తిని సకాలంలో గుర్తించడంలో కేరళ సమయస్ఫూర్తితో సమర్థవంతంగా పనిచేసింది. అందుకే వైరస్ బాధితుల సూచికలో జీరోకు చేరింది. ఇప్పుడు ఇదే ఫార్మాలాను కరోనా వైరస్ విషయంలో కూడా అప్లై చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో రాష్ట్రం ఎప్పటికప్పుడూ తక్షణ చర్యలు చేపడుతోంది.
రెగ్యులర్ చెకప్స్ చేయడం, పబ్లిక్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది. అనుమానం ఉన్న ప్రతి పేషంట్ ను గుర్తించి వారికి తక్షణ వైద్య పరీక్షలు చేయడంలో సక్సెస్ సాధించింది. ప్రతి మూడు గ్రామాలకు రెండు ప్రధాన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి 3.95 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సగటున 7.3 కిలోమీటర్ల దూరంలో జాతీయంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనుభవం కలిగిన వైద్యులను రంగంలోకి దించింది. కేవలం రూ.5 వైద్య సౌకర్యాలు అందించేలా చూసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 పడకలను గుర్తించి వాటిని కరోనా బాధితుల కోసం కేటాయించింది.
2. కరోనా వ్యాప్తిపై సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్ :
కరోనా వైరస్ సోకినట్టు తొలి కేసు నమోదు కాగానే వెంటనే రాష్ట్రం సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్ అమల్లోకి తెచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి కలిసిన వ్యక్తుల్లో కూడా వైరస్ సోకే అవకాశం ఉండటంతో అనుమానితులను గుర్తించి వెంటనే సమాచారం అందించేలా ప్రోత్సహించింది. కరోనాకు మందు లేకపోవడంతో వైరస్ సోకిన వ్యక్తులను సాధ్యమైనంత వరకు మరొకరితో కలవనీయకుండా నిరోధించడమే సరైన మార్గంగా భారీ వ్యూహన్ని అమలు చేసింది. ఇదంతా అక్కడి స్థానిక ఆరోగ్య సిబ్బంది, కేంద్ర వైద్య బృందం, నిపుణులంతా ఒక ఆర్మీగా రంగంలోకి దిగారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానం వస్తే.. వెంటనే వారిని ప్రత్యేకమైన ఆస్పత్రి వార్డుల్లో నిర్బంధించి పర్యవేక్షించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించి పాజిటీవ్ అని తేలితే వారిని నేరుగా రాష్ట్రీయ బృందానికి తరలించింది.
3. నిరంతరాయంగా పర్యవేక్షించడం :
కరోనాను అదుపులో ఉంచేందుకు ఈ ప్రొటోకాల్స్ నిరంతరాయంగా పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ వచ్చింది. ఇందుకోసం 18 మంది నిపుణుల సభ్యులతో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసింది. విదేశీ శాఖలతో పాటు ఇళ్లల్లోనే నిర్బంధాన్ని ఏర్పాటు చేసింది. లాజిస్టిక్స్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. రోజుకు రెండు సార్లు చొప్పున ఆరోగ్యశాఖ మంత్రి వ్యక్తిగతంగా హాజరై సాయంత్రం 6 గంటలకు సమావేశమై పరిస్థితులను సమీక్షించేవారు.
అన్ని జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తూ మరోసటి రోజుకు ఏం అవసరమో అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ప్రతి గ్రామంలో పంచాయతీ అధికారులు, పబ్లిక్ ఆరోగ్య అధికారులతో కలిసి కరోనా పరిస్థితులపై సమీక్షించేలా చేశారు. స్థానిక ఆరోగ్య అధికారులంతా వైరస్ బాధితులను ఇళ్లల్లోనే 28 రోజుల వరకు నిర్బంధించేలా చర్యలు చేపట్టింది. బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు, నిత్యావసర వస్తువులను అందించేలా ఏర్పాటు చేపట్టింది.
4. ప్రజల్లో భయాన్ని తొలగించి నిఘా పెట్టడం :
రాష్ట్రంలో నిఫా వైరస్ సోకిన రోజుల్లో కూడా కేరళ.. గట్టిగానే పోరాడింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రజల్లో భయాందోళన ఎక్కువగా ఉన్నట్టు అయితే వారికి సాయం లేకపోయేది. అప్పటికే పొరుగు ప్రాంతాల్లోని కుటుంబాలన్నీ వైరస్ ప్రభావిత ప్రాంతాలను వదిలి భయంతో మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. వైద్య సౌకర్యాలు అవసరమైన వారికి అందించింది. ఒకరికి వైరస్ సోకింది అనగానే బాధితులు, వారి కుటుంబంపై వివక్షత ఏర్పాడే అవకాశం ఉండటంతో ముందుగానే వారిలో ఆ భయాన్ని దరిచేరనీయకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా కరోనా స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేసింది.
ఎక్కడా కూడా ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టాలని సూచించింది. పౌర సామాజికవేత్తలు కూడా రాష్ట్రమంతటా సందేశాలను పంపుతూ బాధితుల్లో ఎవరిని ఇబ్బందులకు గురిచేయరాదని, వారిని వెంటనే రక్షించాలని సూచనలు చేశారు. రోజులో కనీసం రెండు సార్లు ఆరోగ్య శాఖ మంత్రి టెలివిజన్ కెమెరాల్లో కనిపించి ప్రజలకు భయపడాల్సిన పనిలేదని, వైరస్ కంట్రోల్లోనే ఉందూంటూ ధైర్యం చెప్పారు. అనేక కాల్ సెంటర్లను కూడా ఓపెన్ చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానులను ఈ కాల్ సెంటర్ల ద్వారా నివృతి చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న బాధితుల్లో మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
5. సోషల్ మీడియాపై కంట్రోలింగ్ :
ఆల్కాహాల్ తాగితే కరోనా వైరస్ వస్తుందా? కేవలం వెజ్ తినడం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చా? పందుల నుంచే కరోనా వచ్చిందా? రైనో కొమ్ముల నుంచే ఈ వైరస్ పుట్టిందా? అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా కఠిన చర్యలు చేపట్టింది కేరళ ప్రభుత్వం. రాష్ట్ర అధికారులతో పాటు మీడియా కూడా ఇలాంటి తప్పుదు సమాచారాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టారు.
సాంప్రదాయక మీడియా సంస్థల చీఫ్‌లతో ఆరోగ్య శాఖ మంత్రి సమావేశమై ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షించారు. అనుమానిత వైరస్ కేసులు, మరణాలపై అధికారిక గణాంకాలను మాత్రమే పబ్లిష్ చేయాలని సూచనలు చేశారు. ఇందుకు వారంతా అంగీకరించారు. ప్రతి రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిపై ప్రశ్నలకు సమాధానమిస్తూ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టారు. సోషల్ మీడియలో కరోనాపై ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.