Health Tips: ఒళ్ళు విరవడం మంచిదేనా? ప్రమాదమా? ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు.

Health Tips: ఒళ్ళు విరవడం అనేది ఒకరకంగా శరీరంలోని జాయింట్స్ (సంధులు) ను సడలించడమే అవుతుంది. ఇది చేతులు, వేళ్లు, మెడ, నడుము మొదలైన చోట్ల ప్రభావాన్ని చూపిస్తుంది.

Health Tips: ఒళ్ళు విరవడం మంచిదేనా? ప్రమాదమా? ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు.

Is sweating good for health?

Updated On : July 5, 2025 / 9:04 AM IST

మనందరికీ కొన్నిసార్లు పక్కకు వంగి, చేతులు పైకి లేపి, నడుము విరవడం లేదా మెడను తిప్పడం వంటివి చేయాలనిపిస్తుంది. అలా చేసినప్పుడు ఒంట్లో ఎదో కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా హాయిగా ఉంటుంది. దీనిని చాలామంది “ఒళ్ళు విరవడం” అంటారు. మరి ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? అలా చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఒళ్ళు విరవడం అంటే ఏమిటి?

ఒళ్ళు విరవడం అనేది ఒకరకంగా శరీరంలోని జాయింట్స్ (సంధులు) ను సడలించడమే అవుతుంది. ఇది చేతులు, వేళ్లు, మెడ, నడుము మొదలైన చోట్ల ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు అలా చేసినప్పుడు శరీరం నుంచి ఒకరకమైన శబ్దం కూడా వినిపిస్తుంది. ఇది సింథెట్‌డ్ ఫ్లూయిడ్ (Synovial Fluid) లో ఏర్పడిన గ్యాస్ బబుల్స్ విడుదల కావడం వల్ల వస్తుంది.

ఒళ్ళు విరవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. తాత్కాలిక రిలీఫ్ & సడలింపు:

ఒళ్ళు విరవడం వల్ల జాయింట్లలో ఒత్తిడి తగ్గుతుంది. ఇది కొన్ని సార్లు వెంటనే హాయిగా అనిపించేలా చేస్తుంది. కండరాల సడలింపుకి కూడా సహాయపడుతుంది.

2. రక్తప్రసరణ మెరుగుపడడం:
ఒళ్ళు విరవడం వల్ల కొన్ని చోట్ల రక్తప్రసరణ మెరుగవుతుందట. ఒకరకంగా ఇది మసాజ్ చేయనించుకున్న ఫీలింగ్ ని ఇస్తుంది.

3. చలాకితనం, హుషారు పెరుగుతుంది:
ఒళ్ళు వివరవడం ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో కొంతవరకు సహాయపడుతుంది, ముఖ్యంగా మెడ మరియు వెన్నెముక భాగాల్లో.

4.మెదడు పనితీరు మెరుగుపడుతుంది:
ఇలా జాయింట్ మోషన్‌ చేయడం అనేది మెదడుకు హెచ్చరికలు పంపిస్తుంది. తద్వారా ఇది మానసిక దృష్టిని మెరుగుపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒళ్ళు విరవడం ప్రమాదకరమా?

1.తరచూ చేయడం మంచిది కాదు:
చాలా తక్కువ శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ, తరచూ చేయడం వల్ల జాయింట్స్ సడిలిపోవచ్చు, దీర్ఘకాలంలో వాటి స్థిరత్వం తగ్గిపోవచ్చు.

2. అవయవాలకు గాయలయ్యే ప్రమాదం ఉంది.
అత్యంత శక్తిగా ఒళ్ళు విరవడం వల్ల శరీరంలోని స్నాయువు, లిగమెంట్లు నెమ్మిదిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

3.వెనకభాగం, మెడ సమస్యలు:
ఒళ్ళు విరవడం అనేది ఎలా పడితే ఆలా చేయకూడదు. లేదాంటీ, వెన్నెముకకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

  • తరచూ నొప్పి వస్తే
  • ఒళ్ళు విరవడంలో తీవ్ర శబ్దం రావడం లేదా వింత అనిపిస్తే
  • వాపు లేదా వంగలేని పరిస్థితి ఉంటే

ఒళ్ళు విరవడం ఒక సాధారణ అలవాటు. కొన్నిసార్లు ఇది ఉపశమనం కలిగించవచ్చు. కానీ దీన్ని దూరదృష్టితో చూడాలి. ఇది తప్పు శైలి లో చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలవాటుగా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి.