కరోనా భయంతో కువైట్ గజగజ.. గల్ఫ్ దేశం షట్‌డౌన్!

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 02:56 AM IST
కరోనా భయంతో కువైట్ గజగజ.. గల్ఫ్ దేశం షట్‌డౌన్!

Updated On : March 12, 2020 / 2:56 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అరబ్ దేశాలకు సైతం కరోనా పాకింది. పశ్చిమ ఆసియాలోని తూర్పు అరేబియాకు చెందిన గల్ఫ్ రాష్ట్రమైన కువైట్‌లో కరోనా గజగజ వణికిస్తోంది. కరోనా దెబ్బకు కువైట్ సిటీ అంతర్జాతీయ విమానశ్రయంలో శుక్రవారం నుంచి అన్ని కమర్షియల్ ఫ్లయిట్లను రద్దు చేయనున్నారు. కరోనా భయంతో గల్ఫ్ రాష్ట్రాలను రెండు వారాలపాటు షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు.. ఉద్యోగులకు కూడా 14 రోజుల (మార్చి 12 నుంచి మార్చి 26) వరకు హాలీడే ప్రకటించింది రాష్రప్రభుత్వం. కార్గో ఎయిర్ పోర్టు, కువైట్ వాసుల ( విదేశాల నుంచి తీసుకొచ్చే) విమానాలపై ఈ నిర్ణయం వర్తించదంటూ విమానాల నిషేధంపై ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

అంతేకాదు.. మార్కెట్లు, కేఫ్‌లు, హెల్త్ క్లబులపై కూడా నిషేధం విధించారు. గల్ఫ్ దేశంలో కరోనా కేసులు 72 వరకు నమోదు కావడంతో వైరస్ తీవ్రత పెరగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను చేపడుతోంది ఆ దేశ ప్రభుత్వం. ఖతార్ లో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 262కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఒకే రోజులో 238 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది. కొత్తగా సోకిన కరోనా బాధితులను నిర్భందంలో ఉంచామని తెలిపింది. ఇటీవలే బహ్రెయిన్ 77 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు ప్రకటించింది. ఇరాన్ నుంచి తమ స్వదేశీయులను విమానంలో తరలించింది.(భారత్‌లో కరోనా విజృంభణ: సరిహద్దులు, స్కూళ్లు, సినిమాలు బంద్)

ప్రపంచవ్యాప్తంగా COVID-19 కరోనా వైరస్ అధికారికంగా 114 దేశాలకు వ్యాపించగా, గ్లోబల్‌గా 4,300 మందికి పైగా మృతిచెందారు. ఇందులో అత్యధిక స్థాయిలో చైనాలోనే ఉన్నారు. చైనా తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా ప్రభావానికి గురైంది ఇటలీ.. ఇప్పుడు యూరోపియన్ దేశంలో కూడా భారీ సంఖ్యలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి.

See Also | వైసీపీకి తొమ్మిదేళ్లు పూర్తి….ప్రజా నేతగా ఎదిగిన జగన్‌