Raisins Improve Digestion : జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎసిడిటీని తగ్గించే ఎండు ద్రాక్ష
యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలకు కూడా మంచి మూలం ఎండు ద్రాక్ష. ఆక్సీకరణ నష్టం, ఫ్రీ రాడికల్స్ అనేక రకాల క్యాన్సర్, కణితి పెరుగుదల, వృద్ధాప్యంలో ప్రమాద కారకాలు. వీటి నుండి రక్షణ పొందాలంటే ఎండు ద్రాక్ష తీసుకోవటం మంచిది.

Raisins
Raisins Improve Digestion : డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా చెప్పబడే ఎండు ద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ ఉంటాయి. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఎండుద్రాక్ష జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇవి మలం పేగుల ద్వారా సులభంగా వెళ్ళడానికి సహాయపడతాయి. అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు గణనీయమైన మొత్తంలో ఉంటాయి. కడుపులోని ఆమ్లత స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష తక్కువ సోడియం ఆహారం, ఇందులో పొటాషియం యొక్క మంచి మూలం కూడా ఉంటుంది. హృదయనాళ ప్రమాద కారకాలను తగ్గించటంలో తోడ్పడతాయి.
యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలకు కూడా మంచి మూలం ఎండు ద్రాక్ష. ఆక్సీకరణ నష్టం, ఫ్రీ రాడికల్స్ అనేక రకాల క్యాన్సర్, కణితి పెరుగుదల, వృద్ధాప్యంలో ప్రమాద కారకాలు. వీటి నుండి రక్షణ పొందాలంటే ఎండు ద్రాక్ష తీసుకోవటం మంచిది. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ కళ్లలోని కణాలను ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడతాయి. చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
తాజా పండ్ల కంటే ఎండుద్రాక్షలో ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉన్నప్పటికీ, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌తో పోలిస్తే ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నిర్వాహణకు సహాయపడుతుంది. అదే సమయంలో కేలరీలను తగ్గించుకోవాలని చూస్తున్న వ్యక్తులు అధిక మొత్తంలో ఎండుద్రాక్ష తినకపోవడం మంచిది. ఎండు ద్రాక్షను ఫ్రూట్ సలాడ్స్, స్వీట్స్ తయారీలో, వంటల్లో ఉపయోగించుకోవచ్చు.
ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరగాలంటే ఒక గ్లాసు నీటిలో `10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో తోడ్పడతాయి.