Back Pain Tips: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ఈ చిన్న చిట్కాలతో చెక్ పెట్టేసేయండి.. నొప్పి మళ్ళీ రాదు

Back Pain Tips: బ్యాక్ పెయిన్ కి ప్రధాన కారణం అంటే ఎక్కువసేపు కూర్చోవడం. ఎలా పడితే అలా కాకుండా పొట్టను లోపలికి వంచి, వీపు నేరుగా ఉంచి కూర్చోవడం వల్ల నడుముపై ప్రభావం తగ్గుతుంది.

Back Pain Tips: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ఈ చిన్న చిట్కాలతో చెక్ పెట్టేసేయండి.. నొప్పి మళ్ళీ రాదు

Some healthy tips to reduce back pain

Updated On : July 20, 2025 / 11:38 AM IST

బ్యాక్ పెయిన్ (Back Pain).. నేటి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. యువత చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పనిలో భాగంగా కంప్యూటర్‌ ముందు గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగస్తులు, సరైన శారీరక శ్రమ లేకపోయే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. తక్షణ ఉపశమనం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నారు. అయితే, కేవలం మందుల వల్లనే కాదు సరైన జీవనశైలి, చిన్న మార్పులు, సహజ చిట్కాలు వల్ల కూడా బ్యాక్ పెయిన్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ను తగ్గించే ఆరోగ్య చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బ్యాక్ పెయిన్ తగ్గించే ముఖ్యమైన చిట్కాలు:

1.సరైన భంగిమలో కూర్చోవడం/నడవటం:
బ్యాక్ పెయిన్ కి ప్రధాన కారణం అంటే ఎక్కువసేపు కూర్చోవడం. ఎలా పడితే అలా కాకుండా పొట్టను లోపలికి వంచి, వీపు నేరుగా ఉంచి కూర్చోవడం వల్ల నడుముపై ప్రభావం తగ్గుతుంది. మెడను కూడా ముందు వంచకుండా నిలువుగా ఉంచాలి.

2.విశ్రాంతిని ఇవ్వడం:
ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం అస్సులు చేయకూడదు. అలా చేయడం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం లేదా హల్కా స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

3. కాపడం ,హాట్ లేదా కోల్డ్ ప్యాక్:
నొప్పికి కాపడం పెట్టుకోవడం చాలా మందికి తెలిసిన పనే. నొప్పి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నప్పుడు కోల్డ్ ప్యాక్ (ice pack) ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నొప్పి చాలా కాలంగా ఉంటె హాట్ వాటర్ బ్యాగ్ వాడటం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి హాయిగా అనుభూతి కలుగుతుంది.

4.వ్యాయామాలు, యోగా:
హల్కా వ్యాయామం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకు బ్రిడ్జ్ పోజ్, క్యాట్-కౌ స్ట్రెచ్, చైల్డ్ పోజ్ వంటి యోగా భంగిమలు నడుము నొప్పిని తగ్గిస్తాయి రోజుకు 15 నుంచి 20 నిమిషాల వ్యాయామం మేలు చేస్తుంది.

5.నిద్ర పోజిషన్:
వెల్లికిలా పడుకొని నిద్రపోవడం మంచిది. ఇలా భంగిమలో శరీరం సమాంతరంగా ఉంటుంది. దీనివల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టితే ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది.

ఆహారంలో మార్పులు:

  • కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవాలి
  • పాల ఉత్పత్తులు, బాదం, సూర్య రష్మీ వల్ల కూడా ఈ పోషకాల్ని పొందవచ్చు
  • అధిక బరువు అనేది కూడా నడుము మీద ఒత్తిడి కలిగిస్తుంది.
  • కాబట్టి బరువు తగ్గించుకోవాలి.

నడుము నొప్పి బాధ కలిగించే సమస్య అయినప్పటికీ, దాన్ని నియంత్రించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మందులు తినకుండానే సరైన అలవాట్లు, చిన్న వ్యాయామాలు, హైడ్రేషన్ వంటి చిట్కాల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ప్రతిరోజూ కొద్దిగా శ్రద్ధ పెడితే, ఆరోగ్యంగా బాధ లేకుండా జీవించవచ్చు.