Health Tips: గుడ్డు తింటే మంచిదే కానీ.. వీటితో కలిపి అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?

Health Tips: పాలు శక్తివంతమైన సాత్విక ఆహారం. కానీ, గుడ్డు తామసిక స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు భిన్నమైన స్వభావాల కలయిక వల్ల శరీరంలో టాక్సిన్‌లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

Health Tips: గుడ్డు తింటే మంచిదే కానీ.. వీటితో కలిపి అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?

These foods should never be eaten with eggs

Updated On : August 5, 2025 / 3:48 PM IST

గుడ్డు నిజంగా పోషక విలువలు ఉన్న అద్భుతమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, కొలిన్, ఐరన్ వంటి శక్తివంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి గుడ్డు అస్సలు తినకూడదు. అలా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, ఆధునిక పోషకశాస్త్ర విశ్లేషణల ప్రకారం కొన్ని పదార్థాలను గుడ్డుతో కలిఫై తింటే జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించడమే కాకుండా, టాక్సిన్‌లను ఉత్పత్తి చేసి దుష్పరిణామాలకు దారి తీయవచ్చు. మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.పాలుతో:
పాలు శక్తివంతమైన సాత్విక ఆహారం. కానీ, గుడ్డు తామసిక స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు భిన్నమైన స్వభావాల కలయిక వల్ల శరీరంలో టాక్సిన్‌లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో అజీర్ణతను పెంచుతుంది. ఫలితంగా అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

2.మధుర పండ్లు:
గుడ్డుతో పాటు మధురమైన పండ్లు బొప్పాయి, అరటి, ద్రాక్ష తినకూడదు. అవి జీర్ణ వ్యవస్థలో ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా అరటి, బొప్పాయిని గుడ్డుతో కలిపి తినడం వల్ల అసిడిటి, బలహీనత, చర్మ నల్లదనం వంటి సమస్యలు రావచ్చు.

3.మాంసాహారం:
గుడ్డును ఇతర మాంసాహార పదార్థాలు రెండూ ప్రోటీన్ ప్రబలంగా ఉన్నవే. కాబట్టి, వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రోటీన్ ఒకేసారి అందుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు నొప్పి వంటి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.

4.మసాలా ఎక్కువగా కలిపిన ఆహారం:
గుడ్డుతో ఎక్కువ మసాలా పదార్థాలు కలిపి తినడం మంచిది కాదు. ముఖ్యంగా పెప్పర్, పచ్చిమిర్చి ఎక్కువగా ఉండే పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది పిత్త దోషాన్ని ప్రేరేపించి గ్యాస్ట్రిక్, యాసిడిటీ, హీటింగ్ ఎఫెక్ట్స్ కు కారణం అవ్వొచ్చు.

5.యోగర్ట్ (పెరుగు):
పెరుగును గుడ్డుతో కలిపి అసలు తినకూడదు. పెరుగు చల్లదమైన స్వభావం కలిగి ఉండగా, గుడ్డు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు విరుద్ధ స్వభావాల కారణంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడి చర్మ సంబంధిత రుగ్మతలు రావచ్చు.

పాటించవలసిన జాగ్రత్తలు:

  • గుడ్డు తినాలనుకున్నప్పుడు ఉడకబెట్టిన గుడ్డు తినడం మంచిది
  • గుడ్డు తిన్నాక కనీసం 2 గంటల పాటు పాలు, పెరుగు, పండ్లు వంటి పదార్థాలను దూరంగా ఉండాలి
  • గుడ్డుతో పాటు అధిక ప్రోటీన్ కలిగిన పదార్థాలను తినకూడదు.