విటమిన్స్ లోపం.. కరోనా ముప్పును 80 శాతం పెంచుతుంది.. అధ్యయనం హెచ్చరిక

విటమిన్స్ లోపమా? అయితే కరోనా ముప్పు పొంచి ఉంది జాగ్రత్త.. విటమిన్ లోపంతో బాధపడేవారిలో 80 శాతం వరకు కరోనా ముప్పు ఉంటుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో పాటు విటమిన్ లోపం కూడా కరోనా రిస్క్ పెంచుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇంతకీ ఏ విటమిన్ లోపం ఉంటే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందో నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి విటమిన్ ‘D’ లోపం అధికంగా ఉన్నవారిలో కరోనా ముప్పు ఉంటుందని అధ్యయనంలో తేలింది. విటమిన్ D లోపం ఉంటే.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అవకాశాలు 80శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం హెచ్చరిస్తోంది.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. చికాగో యూనివర్శిటీలోని 489 మంది రోగులను మార్చి, ఏప్రిల్ మధ్య కరోనావైరస్ టెస్టులు చేశారు. ఈ ఫలితాలలో, తగినంత విటమిన్ D స్థాయి ఉన్న 60 శాతం మంది రోగులలో కేవలం 12 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ, విటమిన్ D లోపం ఉన్న 25 శాతం మంది రోగులలో 22 శాతం మంది కరోనా పాజిటివ్ తేలింది. అంటే.. వారిలో COVID (77 శాతం) సోకడానికి 1.77 ఎక్కువ అవకాశం ఉందని నిపుణులు తేల్చేశారు.
కరోనా బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ D తగినంత స్థాయిలో ఉండాలని సూచిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు విటమిన్ D కీలకంగా వ్యవహరిస్తుంది. విటమిన్ D మందులు గతంలో వైరల్ శ్వాసకోశ అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తేలిందని అధ్యయన రచయిత, చికాగో యూనివర్శిటీలోని మెడికల్ ప్రొఫెసర్ David O. Meltzer చెప్పారు.
ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం వంటి ప్రాథమిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని Meltzer సూచించారు. ఎవరైనా విటమిన్ D సప్లిమెంట్ తీసుకుంటే కరోనా సోకదని భావించరాదని అన్నారు.. విటమిన్ D సాధారణంగా ఉదయం పూట ఎండ నుంచి పుష్కలంగా అందుతుందని అందరికి తెలిసిందే..
ఇంకా కొవ్వు చేపలైన సాల్మన్, గుడ్లు, పుట్టగొడుగులు, బలవర్థకమైన ఆహారాలు, పాల ఉత్పత్తుల్లోనూ లభిస్తుంది. వీటితో తగినంత స్థాయిలో విటమిన్ Dని పొందడం అంత సులభం కాదంటున్నారు.. సప్లిమెంట్ల నుంచి పొందే స్థాయిలను పొందలేమంటున్నారు. మీకు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఏదైనా మందులు వాడుతుంటే మాత్రం.. విటమిన్ D సప్లిమెంట్లను ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి..