ఫైబర్ రైస్ తో షుగర్ వ్యాధికి చెక్

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 02:53 AM IST
ఫైబర్ రైస్ తో షుగర్ వ్యాధికి చెక్

Updated On : April 25, 2019 / 2:53 AM IST

 పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2మధుమేహం వస్తుందని,ఆపై కళ్లు,గుండె జబ్బులు,కిడ్నీ సమస్యలు,నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదముందని,అదే ఫైబర్ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని తెలిపారు.అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్ ను తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.అధిక బరువు సమస్యకు కూడా ఇది చక్కని పరిష్కారమని శాస్త్రవేత్తలు తెలిపారు.